MLC Jeevan Reddy | సారంగాపూర్, మే10: నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టీ జీవన్‌రెడ్డి ఓటమి భయంలో పడ్డారు. తాను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని తెలుసుకున్న జీవన్‌రెడ్డి ప్రజలను నమ్మించేందుకు నానాయాతన పడుతున్నారు. ‘నేను ఏం తప్పుచేసిన, నాకెందుకీ శిక్ష, ఎన్నికల్లో కొట్లాడి అలసిపోయిన, ఎమ్మెల్యేగా ఓడించారు. ఎంపీగా నైనా గెలిపించండి’ అని ఓటర్లను వేడుకుంటున్నారు.
శుక్రవారం జగిత్యాల జిల్లా బీర్పూర్, సారంగాపూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిస్తే ఉన్నత స్థానం లో ఉండే అవకాశం వచ్చేది, ఎంపీగా పోటీ చేసే పరిస్థితి వస్తుందనుకోలేదు, మళ్లీ ఓటు సూత్తనో సూడనో అంటూ ప్రజలనుద్దేశించి భావోద్వేగంగా మాట్లాడారు. తనను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయిస్తానని మరోసారి హామీ ఇచ్చారు. తనకు ఇవే చివరి ఎన్నికలంటూ మళ్లీ ప్రజలను నమ్మించేందుకు ప్రయాసపడ్డారు.