సత్తుపల్లి, మే 10 : వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు మోటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లిలో శుక్రవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు పోట్రు శ్రీనివాసరావు (50) తన ఇంటి వెనుక ఉన్న వ్యవసాయ భూమిలో పశువుల కోసం జాడు పెంచుతున్నాడు. దానికి నీరు పెట్టేందుకు మోటర్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య చిట్టెమ్మ, కొడుకు కార్తీక్, కుమార్తె ప్రత్యూష ఉన్నారు. రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.