e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home News ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?

ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?

Health news  | charcoal based products
charcoal based products ( Health news )

charcoal based products | Health news | ఇప్పుడంటే బ్ర‌ష్ చేయ‌డానికి ర‌క‌ర‌కాల టూత్ పేస్టులు వాడుతున్నాం.. కానీ గ‌తంలో ఇలాంటివేవీ లేవు.. ఊళ్ల‌లో మన అమ్మ‌మ్మ‌లు, నాన‌మ్మ‌లు అయితే చాలావ‌ర‌కు బొగ్గుతోనే తోముకునేవాళ్లు.. మ‌న అమ్మ‌లు కూడా చిన్న‌త‌నంలో ప‌ళ్లు తోముకోవ‌డానికి బొగ్గునే ఉప‌యోగించేవారు.. కానీ కాలం మారింది. మార్కెట్‌లోకి ర‌క‌ర‌కాల బ్రష్‌లు, పేస్టులు అందుబాటులోకి వ‌చ్చాయి. జ‌నాలు కూడా వాటికే అల‌వాటు ప‌డిపోయారు. కాల‌క్ర‌మేణా బొగ్గును వాడ‌టం పూర్తిగా త‌గ్గిపోయింది. కానీ ఇప్పుడు మార్కెట్‌లోకి మ‌ళ్లీ బొగ్గు ఉత్ప‌త్తులు వ‌స్తున్నాయి. చార్కోల్ బ్రాండ్‌తో మార్కెట్‌లో ల‌భ్య‌మ‌వుతున్నాయి. కేవ‌లం పేస్టులు మాత్ర‌మే కాదు.. దిండ్లు, ఎయిర్ ప్యూరిఫ‌యిర్లుగా దొరుకుతున్నాయి. అంతేకాదు మ‌నం తినే ఐస్‌క్రీంలు, బ‌ర్గ‌ర్‌లు, కాఫీలల్లోనూ బొగ్గును వాడేస్తున్నారు. మ‌రి అంత‌లా ఈ బొగ్గును ఎందుకు వాడుతున్నారు? వాటికి అంత క్రేజ్ ఎందుకొచ్చింది?

Health news  | charcoal based products
charcoal based products ( Health news )

వీటికి ఏ బొగ్గు వాడ‌తారు?

సాధార‌ణంగా క‌ట్టెల్ని కాలిస్తే బొగ్గు వ‌స్తుంది. ఇది అంద‌రికీ తెలిసిందే. కానీ వివిధ ర‌కాల ఉత్ప‌త్తుల కోసం వాడే బొగ్గు ఇలాంటిది కాదు. దాన్నియాక్టివేటెడ్ చార్కోల్ అని పిలుస్తారు. చెక్క‌, చెక్క‌పొట్టు, కొబ్బ‌రి చిప్ప‌లు.. వంటి వాటిని అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఆక్సిజ‌న్ లేదా నీటి ఆవిరి సాయంతో ఒక ప్ర‌త్యేక ప‌ద్ధతిలో కాలిస్తే వ‌చ్చే బొగ్గును యాక్టివేటెడ్ చార్కోల్ వ‌స్తుంది. ఇలా ఆక్సీక‌ర‌ణ ప‌ద్ధ‌తిలో కాల్చిన బొగ్గులో బొగ్గు రేణువుల మ‌ధ్య ఉండే రంధ్రాల సంఖ్య.. సాధార‌ణ బొగ్గుతో పోలిస్తే చార్కోల్‌లో అనేక రెట్లు ఎక్కువ‌గా పెరుగుతాయి. ఈ రంధ్రాలు గాల్లోని తేమ‌ని, చెడు వాస‌న‌ల్ని, పొట్ట‌లోని విష ప‌దార్థాల‌ను పీల్చుకుంటుంది.

లాభాలేంటి?

Health news  | charcoal based products
- Advertisement -

వెదురు క‌ర్ర‌ల‌ను ఆక్సీక‌ర‌ణ ప‌ద్ధ‌తిలో కాల్చిన‌ప్పుడు వ‌చ్చే చార్కోల్‌.. ప‌ళ్ల పాచికి కార‌ణ‌మైన వైర‌స్‌, బ్యాక్టీరియా, ఫంగ‌స్‌ల‌ను నిర్మూలిస్తుంది. అందుకే ఈ చార్కోల్‌తో అనేక కంపెనీలు మార్కెట్‌లోకి చార్‌కోల్ టూత్ పేస్టుల్ని త‌యారు చేస్తున్నాయి.

Health news  | charcoal based products

చర్మ సౌంద‌ర్యం విష‌యంలోనూ బొగ్గు కీల‌క పాత్ర పోషిస్తుంది. చ‌ర్మ రంధ్రాల్ని బిగుతుగా చేయ‌డంతో పాటు మొటిమ‌ల్ని త‌గ్గించ‌డంలో ఇది స‌హాయ‌ప‌డుతుంది. అందుకే క్రీములు, ఫేస్ మాస్కులు ఇలా చాలా ర‌కాల చార్కోల్ ప్రొడొక్టులు అందుబాటులోకి వ‌చ్చాయి. బొగ్గులో కొన్ని నీళ్లు పోసి పేస్టులా చేసి దోమ‌లు, కీట‌కాలు కుట్టిన చోట రాస్తే వాపు త‌గ్గుతుంది.

Health news  | charcoal based products

దుర్వాస‌న‌ల్ని కూడా బొగ్గు పీల్చేస్తుంది. అందుకే డియోడ్రెంట్ల‌తో పాటు ఎయిర్ ప్యూరిఫ‌యింగ్ బ్యాగులు మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. వీటిని బాత్‌రూంలు, క‌ప్‌బోర్డుల్లో పెట్టుకోవ‌డం ద్వారా దుర్వాస‌న రాకుండా చేయ‌వ‌చ్చు. అంతేకాదు.. బొగ్గుతో త‌యారైన దిండ్లు దుమ్ము, ధూళి పీల్చ‌డంతో పాటు హాయిగా నిద్ర ప‌ట్ట‌డంలోనూ దోహ‌ద‌ప‌డుతాయంట‌.

Health news  | charcoal based products

బొగ్గు పొడి ఆరోగ్యానికి మంచిది. వెదురు లేదా కొబ్బ‌రి చిప్ప‌ల నుంచి వ‌చ్చిన యాక్టివేటెడ్ చార్కోల్ పొట్ట‌లోని చెడు ప‌దార్థాల‌ను పీల్చుకుని మ‌లం ద్వారా బ‌య‌ట‌కు తీసుకొస్తుంది. జీర్ణం కాని ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డానికి, కిడ్నీలు, కాలేయ ప‌నితీరు మెరుగుప‌డ‌టానికి దోహ‌ద‌ప‌డుతుంది. అందుకే బ‌ర్గ‌ర్లూ, కేకులూ, బిస్కెట్లు, ఐస్‌క్రీంలు వంటి ఆహార ప‌దార్థాల త‌యారీలోనూ బొగ్గు వాడ‌కం పెరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

అబ్ర‌హం లింక‌న్ గ‌డ్డం పెంచ‌డం వెనుక ఉన్న క‌థేంటో తెలుసా !

Bullettu bandi | భార‌త్‌లో బుల్లెట్ బండిని మొదటిసారి వాడింది ఎవరు? ఆ మ‌ధ్య‌కాలంలో రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ ఎందుకు క‌నుమ‌రుగైంది?

myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జ‌న‌నేంద్రియాలు.. ఆమె పుట్టుక‌ ఇప్ప‌టికీ మిస్ట‌రీనే

Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హ‌నీమూన్‌.. ఎక్కడో తెలుసా?

ప్రేమ కోసం రాజ‌రికాన్ని, రాజ‌భోగాల‌ను వ‌దిలేసిన యువ‌రాజులు, యువ‌రాణులు వీళ్లే..

Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవ‌లం 11 మందే.. మ‌రి రాజుగారి పనేంటో తెలుసా !

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement