e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News అబ్ర‌హం లింక‌న్ గ‌డ్డం పెంచ‌డం వెనుక ఉన్న క‌థేంటో తెలుసా !

అబ్ర‌హం లింక‌న్ గ‌డ్డం పెంచ‌డం వెనుక ఉన్న క‌థేంటో తెలుసా !

అబ్ర‌హం లింక‌న్‌.. ఈ పేరు చెప్ప‌గానే ఆర‌డుగుల ఎత్తుతో.. పొడ‌వాటి గ‌డ్డంతో ఉన్న బ‌క్క‌ప‌ల్చ‌టి ఆకార‌మే గుర్తొస్తుంది. గ‌డ్డం లేకుండా అబ్ర‌హం లింక‌న్‌ను అస్స‌లు ఊహించుకోలేం. ఇప్పుడే కాదు.. లింక‌న్ అమెరికా అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలోనూ ఆయ‌న గ‌డ్డం ఎంతో ఫేమ‌స్‌. ట్రెండ్ సెట్ట‌ర్ కూడా. కానీ అలాంటి గ‌డ్డం స్టైల్ ఆయ‌న ముందు నుంచి ఫాలో అవ్వ‌లేద‌ని తెలుసా ! అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసే స‌మ‌యానికి కూడా ఆయ‌న క్లీన్ షేవ్‌తోనే ఉండేవాడు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్త‌యి అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యేస‌రికి పొడ‌వాటి గ‌డ్డాన్ని పెంచేశాడు. అదే స్టైల్‌ను క‌డ‌వ‌ర‌కు మెయింటైన్ చేశాడు.మ‌రి ఉన్న‌ట్టుండి అబ్ర‌హం లింక‌న్‌కు ఉన్న‌ట్టుండి గ‌డ్డం పెంచాల‌నే ఆలోచ‌న ఎందుకు వ‌చ్చిందో తెలుసా ! దీని వెనుక ఆసక్తిక‌ర‌మైన క‌థ ఉంది. అదెంటో మీరు తెలుసుకోండి..

అది 1860.. అమెరికా.. దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యం.. రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున అబ్ర‌హం లింక‌న్ బ‌రిలో దిగారు. మిగిలిన పార్టీ అభ్య‌ర్థుల‌తో పోలిస్తే లింక‌న్‌కు జ‌నాల్లో విశేషాద‌ర‌ణ ఉండేది. ఆయ‌న్ను చాలామంది అభిమానించేవారు. వారిలో ఓ ప‌ద‌కొండేళ్ల చిన్నారి గ్రేస్ బెడెల్ కూడా ఉంది. అబ్ర‌హం లింక‌న్‌ను అంత‌కుముందు చూడ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న గురించి విని అభిమానిగా మారింది. ఇక అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా త‌న తండ్రి తీసుకొచ్చిన ఫొటోలో తొలిసారిగా అబ్రహం లింక‌న్‌ను చూసింది ఆ చిన్నారి. అప్ప‌టికి లింక‌న్‌కు గ‌డ్డం ఉండేది కాదు.. కోల‌ముఖంతో బ‌క్క‌ప‌ల్చ‌గా ఉండేవారు. ఆ ఫొటోలో లింక‌న్‌ను చూసిన గ్రేస్ బెడెల్ కాస్త నిరాశ చెందింది. దేశాధ్య‌క్షుడు కావాల్సిన నేత అంత బ‌క్క‌ప‌ల్చ‌గా క‌నిపించ‌కూడ‌ద‌ని అనుకుంది. లింక‌న్‌ను కాస్త గ‌డ్డం ఉంటే బాగుంటుంద‌ని భావించింది. ఇదే విష‌యాన్ని చెబుతూ ఏకంగా అబ్ర‌హం లింక‌న్‌కు లేఖ రాసింది.

- Advertisement -

‘మీరు అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌వ్వాల‌ని బ‌లంగా కోరుకుంటున్నా. మా నాన్న‌, మా న‌లుగురు అన్న‌లు కూడా మీకే ఓటు వేస్తారు. నేను కూడా నాకు తెలిసిన వాళ్లంద‌రినీ మీకే ఓటు వేయ‌మ‌ని చెబుతా. కాక‌పోతే ఒక్క విష‌యం. మా నాన్న ఇటీవ‌ల మీ ఫొటో ఒక‌టి తీసుకొచ్చారు. అందులో మీరు చాలా బ‌క్క‌గా క‌నిపిస్తున్నారు. గ‌డ్డం పెంచుకుంటే చ‌క్క‌గా క‌నిపిస్తారు. మ‌హిళ‌ల‌కు కూడా గ‌డ్డం ఎక్కువగా ఉన్న అబ్బాయిల‌నే ఇష్ట‌ప‌డ‌తారు. కాబ‌ట్టి మీరు గ‌డ్డం పెంచుకుంటే.. మ‌హిళ‌ల ఓట్లు అన్నీ మీకే ప‌డ‌తాయి. అంతేకాకుండా వారి భ‌ర్త‌ల్ని కూడా మీకే ఓటు వేయ‌మ‌ని చెబుతారు. అప్పుడు మీరే ఎల‌క్ష‌న్ల‌లో గెలిచి అమెరికా అధ్య‌క్షుడు అవుతారు. ‘ అని అబ్ర‌హం లింక‌న్‌కు గ్రేస్ బెడెల్‌ లేఖ రాసింది. అంతేకాదు క‌చ్చితంగా జ‌వాబు పంపించాల‌ని పేర్కొంది. ‘ మీకు లెట‌ర్‌ రాసే స‌మ‌యం లేక‌పోతే.. మీకు నాలాంటి కూతుళ్లు ఉంటే వారితో నాకు లెట‌ర్ రాయించండి’ అని లేఖ‌లో పేర్కొంది.

1860 అక్టోబ‌ర్ 15న గ్రేస్ బెడెల్ లేఖ రాస్తే.. అక్టోబ‌ర్ 19న అబ్ర‌హం లింక‌న్ స్వ‌యంగా స్పందించారు. తిరిగి ఆ చిన్నారికి లేఖ రాశారు. ‘ డియ‌ర్ గ్రేస్ బెడెల్ నీ లెట‌ర్ అందింది. నాకు నీలాంటి కూతుళ్లు లేనందుకు చింతిస్తున్నా. నాకు ముగ్గురు కుమారులే ఉన్నారు. వాళ్లు వాళ్ల అమ్మ‌తో ఉన్నారు. ఇక గ‌డ్డం విష‌యానికొస్తే నీ ఆలోచ‌న బాగుంది. కానీ నేనెప్పుడు గ‌డ్డం పెంచుకోలేదు. ఉన్న‌ట్టుండి ఇప్పుడు పెంచుకుంటే ప్ర‌జ‌లు న‌న్ను చూసి పిచ్చిత‌నం అనుకుంటారేమో ! దీని గురించి నువ్వు ఆలోచించ‌లేదా? ఏదేమైనా నువ్వు నా శ్రేయోభిలాషివి’ అని అబ్ర‌హం లింక‌న్‌ బ‌దులిచ్చాడు. చిన్నారి గ్రేస్ స‌ల‌హా మేర‌కు అప్ప‌టి నుంచి అబ్ర‌హం లింక‌న్ గ‌డ్డం పెంచుకోవ‌డం మొద‌లుపెట్టాడు. అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యే స‌మ‌యానికి నిండు గ‌డ్డంతో ఉన్నారు. 1861 ఫిబ్ర‌వ‌రిలో అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు వెళ్తూ న్యూయార్క్‌లోని వెస్ట్‌ఫీల్డ్‌లో ఆగి.. చిన్నారి గ్రేస్‌ను లింక‌న్ ప‌ల‌క‌రించారు. చూశావా ! నీ కోస‌మే ఈ గ‌డ్డం పెంచుకున్నాన‌ని ఆ చిన్నారితో అన్నాడంట‌. ఆ త‌ర్వాత 16వ దేశాధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అబ్ర‌హం లింక‌న్.. ఎన్నో సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టారు. అంత‌ర్యుద్ధంలో అమెరికా ప్ర‌భుత్వం విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. బానిస‌త్వ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసి జ‌న‌హృద‌యాల‌ను గెలుచుకున్నారు. అందుకే ఇన్నేండ్లు అయినా అబ్ర‌హం లింక‌న్‌ను అమెరికా ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ స్మ‌రించుకుంటూనే ఉంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

ఆ 2 ద్వీపాల మ‌ధ్య దూరం 4 కిలోమీట‌ర్లే.. కానీ ఎలా వెళ్లినా ఒకరోజు పడుతుంది.. ఎందుకలా

ఆ ఊరిపెద్ద భారత్‌లో భోజనం చేస్తాడు.. మయన్మార్‌లో నిద్రపోతాడు!

Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవ‌లం 11 మందే.. మ‌రి రాజుగారి పనేంటో తెలుసా !

బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మ‌న శ్లోకాల కంటే పొడ‌వైనది

Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హ‌నీమూన్‌.. ఎక్కడో తెలుసా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement