Telangana movement activists | తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో రసాబాస చోటుచేసుకుంది. సమావేశం కొనసాగుతుండగా కోదండరాం, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లతో మహిళా ఉద్యమకారులు వాగ్వాదానికి దిగారు. ఉద్యమకారులకు కమిటీ అన్యాయం చేస్తోందని మహిళా ఉద్యమకారులు ఆరోపించారు.
మహిళా ఉద్యమకారుల అభిప్రాయాలను కమిటీ తీసుకోవడం లేదని.. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తూతూమంత్రంగా అభిప్రాయ సేకరణ చేస్తోందని వాగ్వాదానికి దిగారు. మహిళా ఉద్యమకారులను అద్దంకి దయాకర్ వారించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో రగడ
కోదండరాం, అద్దంకి దయాకర్లతో మహిళా ఉద్యమకారుల వాగ్వాదం
ఉద్యమకారులకు కమిటీ అన్యాయం చేస్తోంది
మహిళా ఉద్యమకారుల అభిప్రాయాలను కమిటీ తీసుకోవడం లేదు
కమిటీ తూతూమంత్రంగా అభిప్రాయ సేకరణ చేస్తోందని వాగ్వాదం pic.twitter.com/yv5guMG0Lq
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2026
CJI | ‘లేకపోతే నేనే జోక్యం చేసుకుంట’.. ఢిల్లీలో మెట్రోస్టేషన్ల మూసివేతపై సీజేఐ
Spurious Fertilizer | నకిలీ ఎరువును విక్రయించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలంటూ రైతు ఆందోళన
MK Stalin | నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే.. విద్యార్థుల ఆందోళనకు ఎంకే స్టాలిన్ మద్దతు