MLA vemula prashanth reddy | నిజామాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎంపీ అరవింద్
చేసిన వాఖ్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిరాధార ఆరోపణలతో కేసీఆర్ ను అరెస్ట్ చేయాలన్న అరవింద్.. మీ బీజేపీ హయాంలో ఈడీ కేసులు, వాషింగ్ పౌడర్ కేసుల సంగతి ఏంటి ? కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై అరవింద్ చౌకబారు విమర్శలు మానుకొని తెలంగాణకు, నిజామాబాద్ జిల్లాకు కేంద్రం నుండి నిధులు తేవాలన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గల్లంతు కావడంతో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో బీజేపీ అనే పేరు చెబితే జనాలంతా నేలకేసి కొడుతున్నారని అన్నారు. అందుకు గ్రామపంచాయతీ ఫలితాలు నిదర్శనం అని చెప్పారు. ఎమ్మెల్యేలను తానే గెలిపించానని చెప్పుకునే అరవింద్ మాటల ప్రకారం నిజంగా తనకు సత్తా ఉంటే సర్పంచులను ఎందుకు గెలిపించుకోలేకపోయాడని ప్రశ్నించారు.
బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే స్వగ్రామంలో, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ బీజేపీ ఇంచార్జి స్వంత గ్రామాల్లో బీజేపీ ఓడిపోయిన విషయాన్ని అరవింద్ గుర్తుంచుకోవాలని వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. మతం పేరిట జనాలను రెచ్చగొట్టి ఎన్నికలప్పుడు లబ్ధి పొందే బీజేపీ పార్టీకి గ్రామస్థాయిలో సరైన రీతిలో జవాబు దక్కిందని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, 10 ఏండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా ఉంచిన కేసీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎంపీ అరవింద్‌కు లేదన్నారు.
రాష్ట్రానికి బీజేపీ చేసిన అభివృద్ధి శూన్యం..
తెలంగాణకు కేసీఆర్ నమ్మక ద్రోహి కాదని, తెలంగాణకు నిజమైన పెద్ద దోఖేబాజీ బీజేపీ పార్టీనే అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్–కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు కేవలం 7 శాతం లోపే సర్పంచ్‌లుగా గెలిచి, పంచాయతీ ఎన్నికల్లో గొప్ప విజయాలు సాధించినట్టు అరవింద్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఇలాంటి ఫలితాలతో బీజేపీ సత్తా చాటిందని చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు.
తెలంగాణ బీజేపీకి ప్రజలు 8 మంది ఎంపీలను ఇచ్చినా, రాష్ట్రానికి బీజేపీ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పై అరవింద్ చౌకబారు విమర్శలు మానుకొని తెలంగాణకు, నిజామాబాద్ జిల్లాకు కేంద్రం నుండి నిధులు తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు.
2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాక పోవడానికి బీజేపీ సమయం బాగాలేక కాదు, అసలు తెలంగాణలో బీజేపీకి ఎప్పటికీ అధికారం దక్కదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒకటే అని గత రెండు ఏండ్లుగా నిరాధార ఆరోపణలతో కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌ను బీఆర్ఎస్ను కట్టడి చేయాలని కలిసి ప్రయత్నం చేస్తున్నాయి. గత రెండేళ్లుగా అధికారంలో ఉండి పాలనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించలేక, ఇంకా బీఆర్ఎస్, కేసీఆర్‌పై బురద జల్లడమే బీజేపీ ఎంపీలు, నాయకుల పనిగా మారిందన్నారు.
బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తూ కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇకనైనా ఎంపీ అరవింద్ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలు ఆరోపణలు చేయడం మానాలని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. లేకుంటే రాబోయే ఎంపిటిసి, జీస్పిటిసి ఎన్నికల్లో కూడా బీజేపీకి శృంగభంగం తప్పదని, ప్రజలు మరోసారి బీజేపీ అసలు బలమెంటో చూపిస్తారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Actor Shivaji | హీరోయిన్ల డ్రెస్సులపై కామెంట్స్.. శివాజీకి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్
Thalapathy Vijay | ‘ఇదే నా చివరి సినిమా’.. సినిమాలకు గుడ్ బై చెప్పిన దళపతి విజయ్
Rajendran | గుండు వెనుక విషాద కథ.. అదే రాజేంద్రన్‌కు వరంగా మారిందట!