TGSRTC Employees | శక్కర్ నగర్ : రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా సమ్మెలో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని బోధన్ ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు. ఈ కేసులో భాగంగా బుధవారం న్యాయస్థానంలో హాజరైన అనంతరం బయటకు వచ్చిన సదరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడారు. ఏళ్లకాలంగా తమపై పెట్టిన కేసు కొనసాగుతుండడంతో పలుమార్లు న్యాయస్థానానికి వెళ్లవలసి వస్తుందని అన్నారు.
విధులు మానుకొని కేసులకు రావడం ఇబ్బందికరంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంలో తగు చొరవ చూపి తమపై పెట్టిన కేసులను కొట్టివేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ సంజీవరెడ్డి నాయకులు అన్వర్ ఖాన్,సుదర్శన్, దయానంద్, కొండలరావు, రాములు, హనీపుద్దీన్, మంజుల, బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్