Chiranjeevi | కొద్ది రోజుల క్రితం విశ్వంభర ప్రాజెక్ట్ పూర్తి చేసిన చిరంజీవి ఇప్పుడు తన 157వ సినిమాగా అనీల్ రావిపూడితో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని 2026 సంక్రాంతి టార్గెట్ కి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు అనీల్ రావిపూడి 8 సినిమాలు చేయగా, ఇందులో ఒక్క ఫ్లాప్ లేదు. ఆడియన్స్ పల్స్ పట్టి వారికి తగ్గట్టుగానే సినిమాలు తీసి హిట్స్ అందుకుంటున్నాడు. స్టార్స్ నుంచి ఫ్యాన్స్ ఆశించే అంశాలు ఇస్తూనే తన మార్క్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం చిరు- అనీల్ ప్రాజెక్ట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్ కాగా, అదే పేరుతో ఈ సినిమాలో కనిపించనున్నారు. డ్రిల్ మాస్టర్ శివ శంకర్ వరప్రసాద్ గా తన కామెడీతో రచ్చ చేయనున్నారట చిరు. స్కూల్ నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్స్ అదిరిపోతాయని, చిరు కామెడీకి థియేటర్లలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ఖాయమని అంటున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో బుల్లిరాజుగా మాస్టర్ రేవంత్‌తో హాస్యాన్ని పంచిన అనీల్ రావిపూడి ఇప్పడు మెగా 157లో చిరంజీవితో తెగ కామెడీ పండించనున్నాడట. చిరుకి జతగా ఇందులో బుల్లిరాజు కూడా ఉంటాడట. చిరు-రేవంత్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అంటున్నారు.
చిరు డ్యాన్స్ చేస్తే ఫ్యాన్స్ కి పూనకాలే.. ఇక ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. వాటితో పాటు చిరంజీవిలోని కామెడీ యాంగిల్ కూడా అదిరిపోతుంది. ఆయన టైమింగ్ ని పట్టుకోవాలే కానీ మాములుగా ఉండదు. అనిల్ చిరులోని ఆ టైమింగ్ ని పట్టుకుని మెగా 157 సినిమాను చేస్తున్నారట.మెగా 157 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమా.. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ముస్సోరిలో స్కూల్ నేపథ్యంలోని కొన్ని సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు నయనతార, కేథరిన్ థ్రెసా కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం స్కూల్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుందని సమాచారం.