Thota Lakshmi Kantha Rao | మీది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు.. మాఫియా డిపార్ట్మెంట్ అవుతుంది.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Thota Lakshmi Kantha Rao | జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు ఓ సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Thota Lakshmi Kantha Rao | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఖాకీల కనుసన్నల్లో ఇసుక మాఫియా దౌర్జన్యం ఎలా కొనసాగుతుందో స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే సభాముఖంగా చేసిన కామెంట్స్ మరోసారి రుజువు చేస్తున్నాయి. జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు ఓ సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సార్ రాత్రి 12 గంటలకు మహారాష్ట్ర నుండి ఇసుక మాఫియా సభ్యులు వచ్చి ఇసుక తీసుకపోతున్నారని పోలీసులకు ఫోన్ చేసి చెప్పి వారికి జీపీఎస్ కూడా పంపించాను. వాళ్లు దొరకరు. కానీ అర్థగంట తర్వాత అక్కడికి వెళ్లిన పోలీసులు మాత్రం ఇక్కడ ఎవరూ లేరు సార్ అని నాకు కాల్ చేశారు. అసలు విషయం ఏంటంటే వాళ్లు నాకు ఫోన్ చేసిన సమయంలో నేను వారున్న లొకేషన్ నుంచి కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉన్నాను. వాళ్లు నాకు కనిపిస్తున్నారు.. అయినా కూడా పోలీసులు వాళ్లను వదిలేశారన్నారు.
పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే మీది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు మాఫియా డిపార్ట్మెంట్ అవుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు హెచ్చరించారు. పోలీస్ అధికారుల వ్యవహారశైలి పట్ల అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే మీది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు మాఫియా డిపార్ట్మెంట్ అవుతుంది
పోలీస్ అధికారుల పట్ల జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర నుండి ఇసుక మాఫియా సభ్యులు వచ్చి ఇసుక తీసుకపోతున్నారని పోలీసులకు చెప్పి, నేను జీపీఎస్ కూడా… pic.twitter.com/jNTz0u29Cr
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2026
Read Also :
TG Polycet 2026 | తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
Karuppu |‘కరుప్పు’ బాక్సాఫీస్ దూకుడు.. తమిళనాడులో మరో రూ.100 కోట్ల మూవీ..
Swimming Competition: సమ్మర్ కాంపిటీషన్లో యువ స్విమ్మర్ నిత్య ప్రియకు మెడల్
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

