Swimming Competition: సమ్మర్ కాంపిటీషన్లో యువ స్విమ్మర్ నిత్య ప్రియకు మెడల్
Swimming Competition: యువ స్విమ్మర్ నిత్య ప్రియా రాణించింది. సమ్మర్ స్విమ్మింగ్ పోటీల్లో మెడల్ గెలుచుకున్నది. ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంపిటీషన్లో.. 25 మీటర్ల కిక్ ఈవెంట్లో మూడవ ప్రైజ్ సాధించింది. పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.
ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సమ్మర్ స్విమ్మింగ్ కాంపిటీషన్(Swimming Competition)ను .. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించారు. ఇంటర్ స్టేడియా కాంపిటీషన్లో విజేతలుగా నిలిచిన స్విమ్మర్లకు ఇవాళ గచ్చిబౌలి స్టేడియంలో మెడల్స్ ప్రదానం చేశారు. 25 మీటర్స్ ఫ్రీ స్టయిల్ స్విమ్, 25 మీటర్స్ కిక్ కేటగిరీల్లో వివిధ ఏజ్ గ్రూపులో పోటీలను నిర్వహించారు. అండర్-10, అండర్-16 కేటగిరీల్లో బాలబాలికలకు ఈ పోటీలను ఏర్పాటు చేశారు. 25 మీటర్స్ కిక్ ఈవెంట్లో అండర్-10 గర్ల్స్ కేటగిరీలో .. నిత్య ప్రియా రక్కం మూడవ బహుమతి గెలుచుకున్నది. ఆ చిన్నారి కేవలం 40.95 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నది. పోటీల్లో గెలిచిన 24 మంది యువ స్మిమ్మర్లకు అధికారులు ఒకేసారి మెడల్స్ అందజేశారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ సోనీబాలా దేవితో పాటు ఇతర అధికారులు బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

