లింగంపేట్ ఏప్రిల్ 30 : బైకును లారీ ఢీ కొట్టడంతో ఓ యువతి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..
లింగంపేట్ మండలం నల్లమడుగు పెద్ద తండా చెందిన అర్చన (19) ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది. కాగా, మంగళవారం హైదరాబాద్‌లో ఎప్‌సెట్ పరీక్ష రాయడానికి తన సోదురుడితో కలిసి వెళ్లంది. బుధవారం తెల్లవారుజామున సోదరుడు అరవింద్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై నల్లమడుగు పెద్ద తండాకు తిరిగి వస్తుండగా మేడ్చల్ శివారులోని రింగ్‌రోడ్డు వద్ద వారి బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అర్చన మృతి చెందగా అరవింద్ గాయపడ్డాడు. అర్చన మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
ICSE Results | ఐసీఎస్ఈ పది, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలు విడుదల
Fire Accident | హోటల్లో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది దుర్మరణం..!