Lavanya Tripathi | పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం ఇంకా అందరి కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ తీరుని భారతీయులు ఎండగడుతూనే ఉన్నారు. వారికి తగిన బుద్ది చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అనేక ప్రణాళికలు రచిస్తుంది. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మాత్రం దేశం మొత్తం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు చోట్ల ప్రజలు పాకిస్తాన్ జాతీయ జెండాలని రోడ్లపై అంటించి వాటిని కాళ్లతో తొక్కుతూ నిరసనలు తెలుపుతున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో ఓ యువతి మాత్రం వింతగా ప్రవర్తించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రోడ్డుపై అంటించి ఉన్న పాకిస్తాన్ జెండాని అందరు కాళ్లతో తొక్కుకుంటూ వెళుతుంటే సదరు మహిళ మాత్రం తొక్కకుండా అడ్డుకుంటుంది. దాంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ జెండాని రోడ్డుపై నుండి ఎందుకు తీసేస్తున్నావ్. తిరిగి అంటించమని చెబితే నిరాకరించింది. నువ్వు పాకిస్తాన్ సపోర్టర్నా, ఎందుకు జెండాని రోడ్డుపై నుండి తీసేసావు అని గట్టిగా స్థానికులు ప్రశ్నించారు. పాక్ జెండాని రోడ్డుపై వేయాలని లేకుంటే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయిన ఆమె నిరాకరించింది.
దాంతో కొందరు సోషల్ మీడియాలో ఆమె వీడియో షేర్ చేయగా,ఇది వైరల్ అయింది. దీనిపై సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి స్పందిస్తూ.. ఒక వైపు దేశాన్ని రక్షించేందుకు సైనికులు ప్రాణాలకు తెగిస్తుంటే, మరో వైపు సైనికులకు ప్రజలకు హాని చేసే వారికి ఇలాంటి వాళ్ళు మద్దతు తెలుపుతుండడం చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు దేశంలోపల నుండే క్లీనింగ్ మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ లావణ్య త్రిపాఠి ఆ యువతిపై బాగానే సీరియస్ అయింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కూడా నెట్టింట వైరల్‌గా మారింది.ఇక లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్‌ని వివాహం చేసుకున్నాక ఈ అమ్మడు సినిమాలు బాగా తగ్గించింది. అప్పుడప్పుడు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తుంది.
This liberal girl removed Pakistani posters put on road by Hindus.
Hindus confronted her and asked her to put posters back.
They promised her they won’t release the video if she puts the poster back and then they released the video but blurred the face. 😂
Perfectly played.… pic.twitter.com/SErPl02sld
— Incognito (@Incognito_qfs) April 29, 2025