Mad Dog | ధర్పల్లి: ధర్పల్లి మండల కేంద్రంలో పిచ్చికుక్క సైర విహారం చేసి 13 మందిని కరిచిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ధర్పల్లి మండల కేంద్రంలోని పలు కాలనీల్లో పిచ్చికుక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు కనిపించిన వారిని కనిపించినట్టుగా కరిచింది. అంగడి బజార్లో చెప్పులు కుట్టుకుంటున్న బాధితుడు నరేందర్ ను సైతం కుక్క కరిచింది. పిచ్చికుక్క వీరంగంతో బాధితులు వీధుల వెంట పరుగులు తీశారు.
బాధితులంతా మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాకు చికిత్స కోసం క్యూ కట్టారు. కాగా పిచ్చికుక్క ఇంకా చాలా మందిని కరిచిందని, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. మండల కేంద్రంలో కుక్కల బెడద ఎక్కువైందని అధికారులు వెంటనే స్పందించి కుక్కల బెడదను తీర్చాలని బాధితులు అధికారులను కోరుతున్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్