e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News తొలి వ్య‌క్తి : న్యూజెర్సీ ఫెడ‌ర‌ల్ జ‌డ్జిగా ముస్లిం వ్య‌క్తి నియామ‌కం

తొలి వ్య‌క్తి : న్యూజెర్సీ ఫెడ‌ర‌ల్ జ‌డ్జిగా ముస్లిం వ్య‌క్తి నియామ‌కం

తొలి వ్య‌క్తి : న్యూజెర్సీ ఫెడ‌ర‌ల్ జ‌డ్జిగా ముస్లిం వ్య‌క్తి నియామ‌కం

వాషింగ్టన్ : న్యూజెర్సీలోని జిల్లా కోర్టులో ఫెడ‌ర‌ల్ న్యాయ‌మూర్తిగా తొలిసారి ఓ ముస్లిం వ్య‌క్తిని నియ‌మించారు. పాకిస్తాన్-అమెరికన్ జాహిద్ ఎన్‌ ఖురేషిని నియ‌మిస్తూ యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపింది. అమెరికా చరిత్రలో ఫెడరల్ జడ్జి అయిన మొదటి ముస్లిం వ్య‌క్తిగా ఖురేషి రికార్డు సృష్టించారు. 46 ఏండ్ల‌ ఖురేషి పదవిలో నియ‌మించేందుకు సెనేట్ 81-16 ఓట్ల‌తో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఖురేషి నియామకంలో డెమొక్రాట్ల‌తో రిప‌బ్లిక‌న్లు చేతులు క‌ల‌ప‌డం విశేషం.

న్యూజెర్సీ జిల్లా న్యాయమూర్తి ఖురేషి త్వరలో ఫెడ‌ర‌ల్ న్యాయ‌మూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జడ్జి ఖురేషి తన పదవీకాలమంతా దేశానికి సేవ చేయ‌డంలో గ‌డిపార‌ని సెనేట్‌లో ఓటు వేయడానికి ముందు సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ సెనేటర్ రాబర్ట్ మెండెజ్ చెప్పారు. మెరుగైన జీవితం కోసం తన తల్లిదండ్రులు పాకిస్తాన్ నుంచి వలసదారులుగా ఇక్కడకు వచ్చారని మెండెజ్ తెలిపారు. ఖురేషి న్యాయమూర్తిగా నియమించడానికి ముందు అతను రైకర్ డాన్జాంగ్ వైట్ కాలర్ క్రిమినల్ డిఫెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ గ్రూపు అధికారిగా సేవ‌లందించారు. ర‌ట్జ‌ర్ లా కాలేజీ నుంచి న్యాయ‌ప‌ట్టా పొందిన‌ జాహిద్ ఖురేషి 2019 లో న్యూజెర్సీ జిల్లా కోర్టులో మెజిస్ట్రేట్ జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

డిజైన్ 2021: పుణె మ్యూజిక్ యాప్ ‘నాద్‌సాధ‌న్‌’కు ఆపిల్ అవార్డ్‌

వ్యాప్తి అంచ‌నా : ఈ నెల‌లో ఐసీఎంఆర్ సెరో స‌ర్వే

నిజంగా నిజం : కరోనాపై సోష‌ల్ మీడియాలో అన్నీ త‌ప్పుడు రాత‌లే!

క‌రోనా సోమ్నియా : నిద్ర సమ‌స్య‌ల‌ను ఇలా నివారించుకోండి..

డెల్టా వేరియంట్ : బ్రిట‌న్‌లో ద‌ర్యాప్తున‌కు రంగంలోకి సైన్యం

ఇప్పుడేమంటారు : ఆఫ్ఘాన్ జైళ్ల‌లో ఉగ్ర‌వాదుల‌తో సంబంధ‌మున్న పాక్ మ‌హిళ‌లు

యూపీ విభ‌జ‌న : యోగీ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అందుకేనా..?

చ‌రిత్ర‌లో ఈరోజు : 41 ఏండ్ల క్రిత‌మే హాంకాంగ్ ఫ్లూ మ‌హ‌మ్మారి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తొలి వ్య‌క్తి : న్యూజెర్సీ ఫెడ‌ర‌ల్ జ‌డ్జిగా ముస్లిం వ్య‌క్తి నియామ‌కం

ట్రెండింగ్‌

Advertisement