ప్రపంచం ప్రస్తుతం కొవిడ్ -19 మహమ్మారితో పోరాడుతున్నది. అయితే, 1968 లో అచ్చం కరోనా లాంటి వ్యాధే ప్రపంచ దేశాలను కుదిపేసింది. దీనిపై విశేష పరిశోధనలు, అధ్యయనాల అనంతరం 2009లో సరిగ్గా ఇదే రోజున హాంకాంగ్ ఫ్లూ (హెచ్ 1 ఎన్ 1) అనే వ్యాధిని మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది.
స్వైన్ ఫ్లూ మొదటి కేసు 2009 ఏప్రిల్ 15 న అమెరికాలో గుర్తించారు. కాలిఫోర్నియాకు చెందిన 10 సంవత్సరాల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు తొలుత నిర్ధారించారు. రెండు రోజుల తర్వాత ఇక్కడే మరో 8 ఏండ్ల పాపలో కూడా ఈ వైరస్‌ను కనుగొన్నారు. కరోనా వైరస్ మ్యుటేషన్ల మాదిరిగానే.. శాస్త్రవేత్తలు ఇన్ఫ్లుయెంజా ఏ (హెచ్ 1 ఎన్ 1) పీడీఎమ్ 09 వ్యాధికి కారణమని వెల్లడించారు. ఈ జాతి మానవులలో, జంతువులలో ఇంతకు ముందెన్నడూ చూడలేదని తెలిపారు. ఈ వ్యాధిని కనుగొన్న మూడు రోజులకు అమెరికా ఆరోగ్య శాఖ ఈ కొత్త వ్యాధి గురించి డబ్ల్యూహెచ్ఓకు తెలియజేసింది. మరుసటి వారం యునైటెడ్ స్టేట్స్ అంతటా జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారు.
క్రమంగా ఈ వైరస్ అమెరికా నుంచి బయటకు రావడం ప్రారంభించి.. ఏప్రిల్ చివరి నాటికల్లా 70 దేశాల్లో ఈ వైరస్ సోకిన రోగులు కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ కారణంగా 1.5 లక్షలకు పైగా మరణించారు. అమెరికాలో మాత్రమే ఈ వైరస్ కారణంగా 12 వేలకు పైగా ప్రజలు చనిపోయారు. మరణించిన వారిలో 80 శాతం మంది 65 ఏండ్లలోపు వారే ఉన్నారు.
అక్టోబర్ కల్లా ప్రపంచానికి స్వైన్ ఫ్లూ టీకా వచ్చింది. టీకా కారణంగా వైరస్ వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు కూడా తగ్గాయి. దాంతో 2010 ఆగస్టు 10 న ఈ వ్యాధిని మహమ్మారి వర్గం నుంచి డబ్ల్యూహెచ్ఓ తొలగించింది. ఈ వైరస్ ఇప్పటికీ కాలానుగుణ ఫ్లూ వంటి సాధారణ ప్రజల్లో వ్యాపిస్తుండటం చూడవచ్చు.
1991: MS-DOS 5.0 ని విడుదల చేసిన మైక్రోసాఫ్ట్
1987: వరుసగా మూడోసారి బ్రిటన్ ఎన్నికల్లో విజయం సాధించిన మార్గరెట్ థాచర్
1981: ఇరాన్లో 6.9 తీవ్రతతో భూకంపం, దాదాపు 2000 మంది మృతి
1971: చైనాతో వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించిన అమెరికా
1963: వియత్నాం యుద్ధంలో నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన బౌద్ధ సన్యాసి తనను తాను నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
1959: హోవర్‌క్రాఫ్ట్ ఆవిష్కరణ
హేమంత విజ్ఞప్తి : ముస్లింలు జనాభాను నియంత్రించాలి
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
ఇక నిశ్చింత : కరోనా రోగుల సేవలో గ్రేస్ రోబోట్
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
సివిల్స్ 2020 : ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..