e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News నిజంగా నిజం : కరోనాపై సోష‌ల్ మీడియాలో అన్నీ త‌ప్పుడు రాత‌లే!

నిజంగా నిజం : కరోనాపై సోష‌ల్ మీడియాలో అన్నీ త‌ప్పుడు రాత‌లే!

నిజంగా నిజం : కరోనాపై సోష‌ల్ మీడియాలో అన్నీ త‌ప్పుడు రాత‌లే!

వాషింగ్ట‌న్ : భారతదేశంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అన్నింటిలో కరోనా చికిత్సకు సంబంధించి త‌ప్పుడు రాత‌లే ఉంటున్నాయి. ఈ సంస్థలకు హిందీ, ఇత‌ర భాష‌ల‌కు సంబంధించిన వాస్తవాల‌ను తనిఖీ చేసే స‌రైన వ్యవస్థ లేనందున మరింత ఎక్కువగా త‌ప్పుడు సమాచారం వ‌స్తున్న‌ది. ఈ విష‌యాలు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నివేదికలో వెల్లడైంది.

వీరి నివేదిక‌ ప్రకారం, ఏప్రిల్-మే నెల మధ్య ఇటువంటి 150 పోస్టులు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. ఈ పోస్టుల‌న్నింటిలో కరోనాకు సంబంధించి స్వదేశీ చికిత్స పద్ధతులను చెప్పారు. గ‌మ్మ‌త్తైన విషయం ఏమిటంటే.. 10 కోట్లకు పైగా ప్రజలు వీటిని అనుసరిస్తున్నారు. ఇలాంటి త‌ప్పుడు పోస్టుల‌పై నిఘా అంతంత మాత్రంగానే ఉన్న‌ది. ఎవ‌రైనా వినియోగ‌దారులు ఫిర్యాదు చేసిన‌ట్ల‌యితేనే స‌ద‌రు పోస్ట్‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇలా జూన్ వరకు 150 లో 10 పోస్టులను మాత్ర‌మే తొలగించారు లేదా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు లేబుల్ చేశారు. అలాగే వారం రోజుల్లో ట్విట్టర్‌లో 60 కి పైగా క్లెయిమ్స్ రాగా.. వీటిని 35 ల‌క్ష‌ల మంది అనుసరించారు.

ఫాక్ట్ చెక్ సైట్ ఆల్ట్ న్యూస్ ప్రతీక్ సిన్హా ప్రకారం, తప్పుడు సమాచారాన్ని గుర్తించి వాటిని తొల‌గించేందుకు భార‌త్‌కు సంబంధించి ఇప్పుడున్న సిబ్బంది స‌రిపోరు. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. భారతదేశం. యూఎస్‌ల‌లో ప్రకటనల ధరల్లో తేడా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ డబ్బు లేదు. అందుక‌ని ఫాక్ట్ చెక్ నిమిత్తం సిబ్బందిపై ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టడానికి స‌ద‌రు సంస్థ‌లు ఆసక్తి చూపడం లేదు.

త‌ప్పుడు స‌మాచారంపై నిఘా క‌ర‌వు

నిజంగా నిజం : కరోనాపై సోష‌ల్ మీడియాలో అన్నీ త‌ప్పుడు రాత‌లే!

యూట్యూబ్‌లో క‌రోనా చికిత్సా పద్ధతుల వ్యాప్తి చాలా ఉన్న‌ది. ఒక వీడియోలో స్వామి ఇంద్రదేవ్‌జీ మహారాజ్ ఆవిరిని పీల్చడం ద్వారా కరోనా రాద‌ని పేర్కొన్నారు. మాస్క్‌, శానిటైజర్ లేకుండా ఆవిరి ప‌ట్ట‌డం ద్వారా శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుందని చెప్తున్న విష‌యాల్లో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో సంస్థ‌లు ఫాక్ట్ చెక్ చేయ‌డం లేదు. ఆవిరి ప‌ట్ట‌డం గురించి డబ్ల్యూహెచ్‌ఓ గత ఏడాది హెచ్చరిక జారీ చేసింది. అలాగే, ప్రమాదకరమైనదిగా చాలా అధ్యయనాలలో కూడా పేర్కొన్నారు.

బాబా రామ్‌దేవ్‌కు ఊహించ‌ని మద్దతు

బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నివేదిక ప్రకారం, క‌రోనల్ కిట్‌తో క‌రోనాకు చికిత్స చేస్తానని రామ్‌దేవ్ పేర్కొనడంతో ఆయ‌న‌కు ఊహించ‌ని మ‌ద్ద‌తు ల‌భించింది. సరిగ్గా ఊపిరి పీల్చుకోలేని వారి కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈయ‌న‌ వీడియోను ల‌క్ష‌ల‌ మంది చూశారు. ప్ర‌జ‌ల‌ను తప్పుదోవ పట్టించే పోస్ట్‌లను సోష‌ల్ మీడియా ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గిస్తే తప్పుడు పోస్టులు త‌గ్గేవ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

క‌రోనా సోమ్నియా : నిద్ర సమ‌స్య‌ల‌ను ఇలా నివారించుకోండి..

డెల్టా వేరియంట్ : బ్రిట‌న్‌లో ద‌ర్యాప్తున‌కు రంగంలోకి సైన్యం

ఇప్పుడేమంటారు : ఆఫ్ఘాన్ జైళ్ల‌లో ఉగ్ర‌వాదుల‌తో సంబంధ‌మున్న పాక్ మ‌హిళ‌లు

యూపీ విభ‌జ‌న : యోగీ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అందుకేనా..?

చ‌రిత్ర‌లో ఈరోజు : 41 ఏండ్ల క్రిత‌మే హాంకాంగ్ ఫ్లూ మ‌హ‌మ్మారి

హేమంత‌ విజ్ఞ‌ప్తి : ముస్లింలు జ‌నాభాను నియంత్రించాలి

క‌రోనా స్పెష‌ల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!

ఇక నిశ్చింత : క‌రోనా రోగుల సేవ‌లో గ్రేస్ రోబోట్

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిజంగా నిజం : కరోనాపై సోష‌ల్ మీడియాలో అన్నీ త‌ప్పుడు రాత‌లే!

ట్రెండింగ్‌

Advertisement