e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News క‌రోనా సోమ్నియా : నిద్ర సమ‌స్య‌ల‌ను ఇలా నివారించుకోండి..

క‌రోనా సోమ్నియా : నిద్ర సమ‌స్య‌ల‌ను ఇలా నివారించుకోండి..

క‌రోనా సోమ్నియా : నిద్ర సమ‌స్య‌ల‌ను ఇలా నివారించుకోండి..

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వైర‌స్‌కు గురైన‌వారు, సాధార‌ణ ప్ర‌జ‌లు నిద్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా తిన‌డం, ప‌డుకోవ‌డం వంటి ప‌నుల్లో మార్పులు రావ‌డంతో నిద్ర స‌మ‌స్య‌లు ముంచుకొస్తున్నాయ‌ని చెప్తున్నారు వైద్యనిపుణులు. క‌రోనా కార‌ణంగా ప్ర‌భావిత‌మైన అంశాల్లో మొద‌టిది మ‌న జీవ‌న‌శైలి. బాడీ క్లాక్‌లో మార్పుల వ‌ల్ల జీవ‌క్రియ‌ల్లో మార్పులు సంభ‌వించి మ‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతున్నాయి. ఇటీవలి అధ్యయనంలో క‌రోనా సమయంలో నిద్రలేమి రోగుల సంఖ్య‌ వేగంగా పెరిగినట్లు గుర్తించారు. నిద్రలేమి రోగులు ఏడాదిలో 20 శాతం నుంచి 60 శాతానికి పెరిగారు.

కరోనా వైర‌స్ మ‌న‌లో మానసిక ఆరోగ్యంతోపాటు సాధార‌ణ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసింది. ఈ భ‌యం కార‌ణంగా ఆందోళన, ఒత్తిడి చాలా పెరిగి ప్రజల నిద్రపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్న‌ది. ఈ పరిస్థితినే కరోనా సోమ్నియా అని పిలుస్తున్నారు. ఈ క‌రోనా సోమ్నియా స‌మ‌స్య‌కు సంబంధించి కొన్ని విష‌యాల‌ను తెలుసుకుందాం.

శారీరంగా అల‌సిపోయినా..

ఈ సమస్యను టైర్డ్ బట్ విర్డ్ సిండ్రోమ్ అంటారు. సాధారణంగా ఇది ఒత్తిడి, ఆందోళన కారణంగా వ‌స్తుంది. శారీరకంగా అలసిపోయినప్పటికీ నాడీ వ్యవస్థ పోరాటాన్ని మెద‌డు చురుకుగా ఉంచుతుంది. ఫ‌లితంగా మేల్కొన్న‌ట్లుగానే ఉంటారు. దీనికి పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ అని పిలుస్తారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉన్న‌ట్ల‌యితే, ఒత్తిడి, ఆందోళ‌న లేకుండా చూసుకోవాలి. శ్వాస వ్యాయామాలు, కండ‌రాల వ్యాయామాలు చేయాలి.

మెద‌డు-హృద‌యం మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

మనస్సును శాంతపరచడానికి ధ్యానం ఉత్తమ మార్గం. వరుసగా 8 వారాలు ధ్యానం చేసినవారికి మంచి నిద్ర ఉంటుందని తేలిన‌ట్లు స్లీప్ జర్నల్‌లో 2014 లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తెలిపారు. ప్రతి రాత్రి 45 నిమిషాలు ముందుగా నిద్ర పోవ‌డం అల‌వాటు చేసుకోవాలి. వరుసగా 6 నెలలు ధ్యానం చేసిన వారిలో 40 నుంచి 50 శాతం మంది నిద్రలేమి నుంచి ఉపశమనం పొందడం ప్రారంభించారు. ఉదయం కంటే సాయంత్రం ధ్యానం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.

ధ్యానం చేసినా నిద్ర రావ‌డం లేదా..?

ఇలాంటి వారు వారి మనస్సును తేలికపరచడానికి వారి చింతల గురించి ప్రతి రాత్రి పడుకునే ముందు గంట పాటు నోట్ చేసుకోవాలి. ఈ అలవాటు మానసిక ఆరోగ్యానికి, ప్రారంభ నిద్రకు కూడా సహాయపడుతుంది. ప‌డుకునే ముందు కుటుంబ స‌మ‌స్య‌ల‌ను ఆలోచించ‌డం మానేయాలి. దాంతో మంచి నిద్ర పొందుతారు.

సేఫెస్ట్ స‌ప్లిమెంట్ ఏది..?

నిద్రకు సురక్షితమైనది మెలటోనిన్. మ‌నం త్వరగా నిద్రపోవడానికి, ఎక్కువసేపు నిద్రపోవడానికి సహాయపడే హార్మోన్ ఇది. దుష్ప్రభావాలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ స్లీప్ అప్నియా, రెస్ట్‌లెస్ లెగ్‌ సిండ్రోమ్ లేదా పానిక్ డిజార్డర్ వంటి ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే వైద్యుడి సలహా లేకుండా ఎటువంటి సప్లిమెంట్ తీసుకోవ‌ద్దు.

మ‌రికొన్ని కార‌ణాలేంటంటే..?

శ‌రీరం ఎక్కువ‌గా బ‌రువు ఉండ‌టం కూడా నిద్ర‌లేమికి ప్ర‌ధాన కార‌ణం. గ‌ది ఉష్ణోగ్ర‌త‌లు, ప‌డ‌క‌గ‌దిలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం, రంగులు, మ్యూజిక్‌, రాత్రివేళ గాడ్జెట్స్ వినియోగం వంటివి కూడా నిద్ర‌లేమి స‌మ‌స్య‌ను తెచ్చిపెడుతుంటాయి. అలాగే, ప‌గ‌టిపూట ప‌డుకోవ‌డం, మ‌సాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం, గుర‌క స‌మ‌స్య‌లు వంటివి కూడా నిద్ర‌లేమికి కార‌ణ‌మ‌వుతుంటాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

డెల్టా వేరియంట్ : బ్రిట‌న్‌లో ద‌ర్యాప్తున‌కు రంగంలోకి సైన్యం

ఇప్పుడేమంటారు : ఆఫ్ఘాన్ జైళ్ల‌లో ఉగ్ర‌వాదుల‌తో సంబంధ‌మున్న పాక్ మ‌హిళ‌లు

యూపీ విభ‌జ‌న : యోగీ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అందుకేనా..?

చ‌రిత్ర‌లో ఈరోజు : 41 ఏండ్ల క్రిత‌మే హాంకాంగ్ ఫ్లూ మ‌హ‌మ్మారి

హేమంత‌ విజ్ఞ‌ప్తి : ముస్లింలు జ‌నాభాను నియంత్రించాలి

క‌రోనా స్పెష‌ల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!

ఇక నిశ్చింత : క‌రోనా రోగుల సేవ‌లో గ్రేస్ రోబోట్

హార్ట్ రిథ‌మ్ : క‌రోనా కార‌ణంగా అరిథ్మియాకు అవ‌కాశాలు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనా సోమ్నియా : నిద్ర సమ‌స్య‌ల‌ను ఇలా నివారించుకోండి..

ట్రెండింగ్‌

Advertisement