Viral news : కొలంబియా (Colombia) లో ఓ విమానానికి అనూహ్య పరిస్థితి ఎదురైంది. పర్వత శిఖరాల్లో ఉన్న విమానాశ్రయం (Airport) వద్ద పైలట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. వాతావరణం అనుకూలించక రెండుసార్లు విఫలయత్నం జరిగింది. దాంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరుగుతుందేమోన్న భయంతో కొందరు గావుకేకలు పెట్టారు. మరికొందరు బోరున విలపించారు. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానానికి ప్రమాదం తప్పింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. విమానం కొలంబియాలోని బొగోటా నుంచి పాస్టోలోని విమానాశ్రయానికి బయలుదేరింది. ఆ ఎయిర్‌పోర్టు సముద్ర మట్టానికి దాదాపు ఆరు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ దట్టమైన పొగమంచు, బలమైన గాలులు వీయడంతో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. పైలట్ తొలుత విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండో ప్రయత్నమూ విఫలమైంది. దాంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భయంతో కొందరు గట్టిగా కేకలు పెట్టారు. మరికొందరు ఏకంగా ఏడ్చారు. ఇంకొందరు ప్రార్థనలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ALERT: Frightened passengers openly praying as people cry, scream, and throw up after having to abort landing multiple times at a notorious mountain runway.
Avianca Airlines flight AV9401 from Bogotá, Colombia, to the remote city of Pasto was forced to divert twice due to thick… pic.twitter.com/N8L3E6LEgz
— E X X ➠A L E R T S (@ExxAlerts) May 27, 2026
వాతావరణం ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో పైలట్ మరో ప్రయత్నం చేయకుండా విమానాన్ని తిరిగి బొగోటాకు తీసుకెళ్లాడు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణం కుదుటపడ్డాక విమానం ఎట్టకేలకు పాస్టోలోని ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఘటనపై సదరు విమానయాన సంస్థ స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగానే ఇలా జరిగిందని పేర్కొన్నది. క్లిష్ట పరిస్థితుల్లో పైలట్ సరైన నిర్ణయం తీసుకున్నారని అభినందించింది.