సిద్దిపేట కమాన్, ఆగస్టు 30 : భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ముత్యాల తలంబ్రాలు, శేష వస్త్రాలను భక్తుల ఇళ్లకు చేర్చే మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్న శ్రీరామకోటి భక్త సమాజం సేవలు అభినందనీయమని ప్రముఖ యోగా గురువు నాగేష్ జీ అన్నారు.
ఆదివారం సిద్దిపేటలో నాగేష్ జీ దంపతులకు భద్రాచల రామయ్య తలంబ్రాలను శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపకులు, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నాగేష్ జీ మాట్లాడుతూ, తాము భద్రాచలం వెళ్లలేకపోయినా, రామయ్య కల్యాణ మహోత్సవంలో సమర్పించిన గోటి తలంబ్రాలు తిరిగి స్వామివారి కల్యాణం అనంతరం తమ ఇంటికి చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
లక్షలాది మంది భక్తులకు ఉచితంగా రామయ్య తలంబ్రాలను అందిస్తూ, భక్తి భావాన్ని ప్రతి ఇంటికీ చేర్చుతున్న రామకోటి రామరాజు కృషి అమోఘమని ప్రశంసించారు.