నడిరోడ్డుపై హత్యలు.. వరుస నేరాలతో సిటీలో భయాందోళనలు
నగరంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. వరుసుగా జరుగుతున్న నేరాలు-ఘోరాలతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. కత్తులతో వికృత క్రీడ చేస్తున్న నేరస్తులు నడిరోడ్డుపై నరమేధం చేస్తున్నా.. పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నదంటూ.. ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
- జనసంచారం మధ్య బహిరంగ హత్యలు
- నిందితుల్లో ‘అధికార’ నాయకుల అనుచరులు
నగరంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. వరుసుగా జరుగుతున్న నేరాలు-ఘోరాలతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. కత్తులతో వికృత క్రీడ చేస్తున్న నేరస్తులు నడిరోడ్డుపై నరమేధం చేస్తున్నా.. పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నదంటూ.. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై హత్యలు.. హత్యాయత్నాలు చేస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్న నేరగాళ్లను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం.. మొద్దు నిద్రలో ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. రోజు రోజుకు శాంతి భద్రతలు పూర్తిగా గాడితప్పి రౌడీమూకల చేతుల్లోకి వెళ్తున్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ)
రాష్ట్ర హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి శాంతి భద్రతలను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమయ్యాడంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలు సైతం శాంతి భద్రతల విషయంలో ఆందోళన వ్యక్తం చేయడం తెలంగాణలో దిగజారుతున్న శాంతి భధ్రతలకు నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రశ్నార్థకంగా విజిబుల్ పోలీసింగ్
జనసంచారం మధ్య జరిగిన బహిరంగ హత్యలతో విజిబుల్ పోలీసింగ్ ప్రశ్నార్ధకంగా మారింది. రౌడీమూకలు, గంజాయి బ్యాచ్‌లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాలో అధికార పార్టీ నాయకుల అండదండలతో ముఠా కక్షలు, భూ దందాలు రాజ్యమేలుతుండగా సామాన్య పౌరుడు శాంతి భద్రతల వ్యవస్థపై పూర్తిగా నమ్మకం కోల్పోతున్నాడు. పగటి పూట హత్యలు, భూ దందాలు, ముఠా కక్షలు పెరిగిపోతుంటే ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ వంటి ప్రత్యేక పోలీస్ విభాగాలను కేవలం రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడానికే ప్రభుత్వం వాడుకుంటుందనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్సించాల్సిన పోలీసు యంత్రాంగాన్ని అధికార పార్టీ తన సొంత ప్రయోజనాల కోసం వాడుతూ.. శాంతి భధ్రతలను పూర్తిగా గాలికొదిలేసిందనే విమర్శలు వస్తున్నాయి.
వరుస ఘటనలివి..
- నాగోల్‌లో ఒక బార్ పర్మిట్ రూమ్‌లో రౌడీషీటర్ నయీంను వేటకోడవళ్లతో దారుణంగా నరికి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణం వెనుక ఏకంగా అధికార పార్టీ నాయకుడి అనుచరులే కాకుండా ఓ మంత్రి కొడుకుకు ప్రధాన అనుచరులని విస్తుగొలిపే విషయం దర్యాప్తులో బయట పడ్డాయి. నేరస్తులు గవర్నమెంట్ అని రాసి ఉన్న కారులో వచ్చి బాధితుడి కళ్లలో కారం పొడి చల్లి హత్య చేశారు. జనాల మధ్యే హత్య చేయాలనే పథకంతోనే ఈ హంతక ముఠా స్కెచ్ వేసిందని దర్యాప్తులో తేలింది.
- వనస్థలిపురం ఎన్టీఓస్ కాలనీ బస్‌స్టాండ్ వద్ద పాల వ్యాపారి భజంగరావుపై సురేందర్సింగ్ అనే వ్యక్తి వేటకొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పాల వ్యాపారి దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. స్థిరాస్థి వివాదం నేపథ్యంలోనే ఈ హత్య యత్నం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
- నిజామాబాద్‌లోనూ పట్టపగలే యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును ఆమె సోదరుడు హత్య చేశాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

