ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి..
విలక్షణ నటుడు ఉపేంద్ర మరోసారి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో ఆయన కనిపించబోతున్నారు. ‘జాంబీ రెడ్డి’ సీక్వెల్లో ఆయన ఓ ఇంట్రెస్టింగ్ రోల్‌ని పోషించినట్లు మేకర్స్ వెల్లడించారు.
విలక్షణ నటుడు ఉపేంద్ర మరోసారి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో ఆయన కనిపించబోతున్నారు. ‘జాంబీ రెడ్డి’ సీక్వెల్లో ఆయన ఓ ఇంట్రెస్టింగ్ రోల్‌ని పోషించినట్లు మేకర్స్ వెల్లడించారు. ‘జాంబీ రెడ్డి-2’ చిత్రంలో తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తుండగా సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్‌వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
ఇందులో ఆయన భారీ చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ చేతిలో పొడవైన ఆయుధంతో కనిపిస్తున్నారు. ‘ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి సిద్ధం’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘జాంబీ రెడ్డి-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియాతో పాటు నేపాలీ, జపనీస్ భాషల్లోనూ ఈ సినిమా విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

