ది ఇంటర్న్ రీమేక్ కోసం..
అమెరికన్ కామెడీ డ్రామా ‘ది ఇంటర్న్' హిందీ రీమేక్ కోసం గత ఐదేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమితాబ్‌బచ్చన్, దీపికా పడుకోన్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటన కూడా వెలువడింది.
అమెరికన్ కామెడీ డ్రామా ‘ది ఇంటర్న్’ హిందీ రీమేక్ కోసం గత ఐదేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమితాబ్‌బచ్చన్, దీపికా పడుకోన్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటన కూడా వెలువడింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మరలా సెట్స్‌మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అమిత్‌శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ‘పీకూ’ తర్వాత అమితాబ్‌బచ్చన్-దీపికా పడుకోన్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం.
హాలీవుడ్ చిత్రాన్ని యథాతథంగా కాకుండా భారతీయ నేపథ్యానికి తగినట్లుగా మార్పులు చేయబోతున్నట్లు దర్శకుడు తెలిపారు. స్వీయ నిర్మాణంలో దీపికా పడుకోన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నదని తెలిసింది. ఓ యువ వ్యాపారవేత్త ఫ్యాషన్ సంస్థను నడిపించే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, అదే సంస్థలోకి 70 ఏళ్ల రిటైర్డ్ వ్యక్తి సీనియర్ ఇంటర్న్‌గా చేరడంతో వారిద్దరి మధ్య వృత్తిపరమైన స్నేహం, మానవ సంబంధాలు ప్రధానంగా ‘ది ఇంటర్న్’ చిత్రాన్ని తెరకెక్కించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

