Cyprus coast | 267 మందితో వెళ్తున్న ఫెర్రీ బోల్తా.. 100 మందిని రక్షించిన రెస్క్యూ టీం
Cyprus coast : సైప్రస్ తీరంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఫెర్రీ (బోటు) బోల్తా పడింది. ఈ ఫెర్రీలో 267 మంది ఉండగా.. 100 మందిని రెస్క్యూ టీంలు రక్షించాయి.
Cyprus coast : సైప్రస్ తీరంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఫెర్రీ (బోటు) బోల్తా పడింది. ఈ ఫెర్రీలో 267 మంది ఉండగా.. 100 మందిని రెస్క్యూ టీంలు రక్షించాయి. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన ఆదివారం జరిగింది. సైప్రస్ రవాణా శాఖ మంత్రి ఎర్హాన్ అరిక్లి వెల్లడించిన వివరాల ప్రకారం.. సైప్రస్‌లోని కిరెనియా (గిర్నె) పోర్టు నుంచి ఒక ఫెర్రీ టర్కీలోని మెర్సిన్ ప్రావిన్స్‌లో ఉన్న టసుకు పోర్టుకు బయల్దేరింది.
ఈ ఫెర్రీలో మొత్తం 267 మంది ఉన్నారు. వీరిలో 259 మంది ప్రయాణికులుకాగా.. 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఫెర్రీ బయల్దేరిన కొద్దిసేపటికే, తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే బోల్తాపడింది. దీంతో అందులోని ప్రయాణికులు నీళ్లలో కొట్టుకుపోయారు. లైఫ్ జాకెట్లు ధరించిన ప్రయాణికులు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. లైఫ్ జాకెట్ల సాయంతో నీళ్లపైనే తేలియాడుతూ తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. దీని గురించి వెంటనే సమాచారం అందుకున్న నార్తర్న్ సైప్రస్, టర్కిష్ రిపబ్లిక్కు చెందిన రెస్క్యూ టీంలు సహాయక చర్యలు ప్రారంభించాయి.
🚨A passenger ferry traveling from Girne to Taşucu in Türkiye’s Mersin province capsized after taking on water off the coast of Northern Cyprus on August 30.
Coast Guard vessels, helicopters and civilian boats were deployed for rescue operations, while ambulances were placed on… pic.twitter.com/jlrTFygxFZ
— Global Brief (@globalbrief_now) August 30, 2026
బాధితుల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే 100 మందికిపైగా రక్షించినట్లు తెలుస్తోంది. మిగిలిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సైప్రస్ యురోపియన్ యూనియన్‌లో భాగంగా కొనసాగుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- boat
- Cyprus coast
- Ferry
- Passenger
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

