న్యూఢిల్లీ: రైలు ప్రయాణ సమయంలో టికెట్ల తనిఖీపై రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. వాట్సప్ ఫార్వర్డ్ లేదా స్క్రీన్ షాట్ తీసిన టికెట్లు ఇక మీదట చెల్లబోవని స్పష్టం చేసింది. అసలైన టికెట్లనే అనుమతిస్తామని పేర్కొంది. టికెట్ల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించింది.
వాట్సప్ ఫార్వర్డ్ లేదా స్క్రీన్ షాట్ టికెట్లను ఎడిటింగ్ లేదా ఫార్వర్డ్ చేసే అవకాశం ఉందని, వీటిని అరికట్టేందుకు ఇ-టికెట్లు లేదా ప్రింటెడ్ టికెట్లనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణికులు ప్రయాణ సమయంలో ఫార్వర్డ్ మేసేజులు చూపిస్తే వారిని టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణిస్తారు. జరిమానాతో పాటు రైల్వే నిబంధనల ప్రకారం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటారు.