Quadruplets | ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. ఎక్కడంటే..!
Quadruplets | రాజస్థాన్ (Rajasthan) లోని ఝలావర్ (Jhalawar) లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల ఓ మహిళ ఒకే ప్రసవంలో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ ఉన్నారు. శిశువులు నెలలు నిండకుండానే జన్మించడం, బరువు కూడా తక్కువగా ఉండటంతో వారిని ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) లో ఉంచి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
Quadruplets : రాజస్థాన్ (Rajasthan) లోని ఝలావర్ (Jhalawar) లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల ఓ మహిళ ఒకే ప్రసవంలో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ ఉన్నారు. శిశువులు నెలలు నిండకుండానే జన్మించడం, బరువు కూడా తక్కువగా ఉండటంతో వారిని ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) లో ఉంచి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
ఝలావర్ నగరంలోని భోయ్ మొహల్లా నివాసితులైన జ్యోతి కశ్యప్ (25), అరుణ్ కశ్యప్ దంపతులకు ఇప్పటికే ఒక సంతానం ఉంది. రెండో ప్రసవం కోసం ఆమె స్థానిక ప్రభుత్వ హీరా కున్వర్ బా మహిళా ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఉదయం వైద్యులు ఆమెకు సిజేరియన్ నిర్వహించగా నలుగురు శిశువులు జన్మించారు. సుమారు 29 వారాలకే ప్రసవం జరగడంతో శిశువులు కేవలం 1.1 కిలోల నుంచి 1.2 కిలోల బరువు మాత్రమే ఉన్నారు.
సాధారణంగా పూర్తి నెలలు నిండిన శిశువులు 2.5 కిలోల బరువు ఉంటారని, అయితే ఈ శిశువుల ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో వారికి శ్వాస అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వైద్యులు వెల్లడించారు. తన వృత్తి జీవితంలో ఒకే ప్రసవంలో నలుగురు శిశువులు జన్మించడం చూడటం ఇదే మొదటిసారని డాక్టర్ విశాల్ పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి 24,000 ప్రసవాల్లో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం తల్లి జ్యోతి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమెను గైనకాలజీ వార్డుకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. శిశువుల్లో ఒకరి ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడగా మిగిలిన ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ పరిణామంపై తండ్రి అరుణ్ కశ్యప్ హర్షం వ్యక్తంచేశారు. తాను ఒక కుమార్తె పుడుతుందని ఆశించాను. కానీ దేవుడు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడిని ప్రసాదించాడు. దైవ నిర్ణయం ఏదైనా తమకు సంతోషమేనని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

