Indian Railways | వేగంగా..సులభంగా ఐఆర్సీటీసీ కొత్త ఆన్లైన్ టికెట్ బుకింగ్ వెబ్సైట్
ఆన్లైన్ టికెట్ బుకింగ్ కోసం భారతీయ రైల్వే ఒక నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌కు చెందిన బీటా వెర్షన్‌పై ఐఆర్సీటీసీ పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది.
- 15 నుంచి అందుబాటులోకి
న్యూఢిల్లీ, జూలై 11: ఆన్లైన్ టికెట్ బుకింగ్ కోసం భారతీయ రైల్వే ఒక నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌కు చెందిన బీటా వెర్షన్‌పై ఐఆర్సీటీసీ పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది. అప్‌గ్రేడ్ చేసిన ఈ వెబ్సైట్ నెమ్మదిగా జరుగుతున్న అప్లోడింగ్, సంక్లిష్టమైన క్యాప్చాలు, తరచుగా వచ్చే పాప్-అప్లు వంటి ప్రయాణికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నది.
కొత్త వెబ్సైట్ విశేషాలు
- టికెట్ బుకింగ్‌ను మరింత వేగవంతం, సులభతరం చేయడానికి కొత్త ఐఆర్సీటీసీ ప్లాట్‌ఫారమ్‌లో మార్పులు.
- ప్రకటనలు లేని తక్కువ గ్రాఫిక్స్‌తో సరళమైన ఇంటర్ఫేస్ ఉంటుంది.
- కొత్త క్యాప్చా చిన్నగా, సులభతరంగా ఉంటుంది. లాగిన్ అవ్వడానికి, చెల్లింపులకు సమయాన్ని తగ్గిస్తుంది.
- ప్రయాణికులు ఇకపై స్లీపర్, 3ఏసీ, 2ఏసీ వంటి అన్ని తరగతుల్లోనూ సీట్ల లభ్యతను ఒక్కొక్కటిగా కాకుండా ఒకే స్క్రీన్‌పై చూసుకోవచ్చు.
- టికెట్ బుకింగ్ కోసం తక్కువ దశలు ఉండటం వల్ల బుకింగ్ సమయం తగ్గుతుంది.
- క్రమం తప్పకుండా ప్రయాణించే ప్రయాణికులు ఇకపై భవిష్యత్ బుకింగ్‌ల కోసం తమ వ్యక్తిగత వివరాలను ఒక్కసారి మాత్రమే నింపితే సరిపోతుంది. వీటిని వెబ్సైట్లో భద్రపరుస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

