Yashasvi Jaiswal | ఓ దిగ్గజం చెప్పాడు.. బంతిని ఆడేంతవరకూ లేవొద్దని..!
Yashasvi Jaiswal : టెస్టు సిరీస్ మొదలు కానున్నందున భారీ స్కోర్‌పై కన్నేశాడు ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal). లంకతో గాలే స్టేడియంలో టెస్టుకు ముందు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి నేర్చుకున్న ఫీల్డింగ్ పాఠంను పంచుకున్నాడీ ఈ ఓపెనర్.
Yashasvi Jaiswal : శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించాలని భారత జట్టు పక్కాగా సన్నద్ధమవుతోంది. ఆగస్టు 9వ తేదీ నుంచి టెస్టు సిరీస్ మొదలు కానున్నందున భారీ స్కోర్‌పై కన్నేశాడు ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal). లంకతో గాలే స్టేడియంలో టెస్టుకు ముందు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి నేర్చుకున్న ఫీల్డింగ్ పాఠంను పంచుకున్నాడీ ఈ ఓపెనర్. ‘ఒక దిగ్గజం చెప్పారు. బంతిని ఆడేంతవరకూ లేవొద్ద’ని అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడీ యువకెరటం.
గాలేలో తొలి టెస్టుకు ముందు భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. గురువారం ఫీల్డింగ్ సెషన్లో పాల్గొన్న యశస్వీ.. క్యాచ్‌లు పట్టడం సాధన చేశాడు. అనంతరం అతడు.. మాజీ సారథి రోహిత్ శర్మ తనను హెచ్చరించడం స్టంప్ మైక్‌లో రికార్డైందని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించాడు యశస్వీ. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2024-25 సమయంలో రోహిత్ చెప్పిన ఫీల్డింగ్ పాఠాన్ని ఇప్పటికీ మరువను అని పేర్కొన్నాడీ ఓపెనర్. ఒక దిగ్గజం చెప్పారు. బంతిని ఆడకముందే లేవొద్దని అని అతడు కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
అసలేం జరిగిందంటే..
రెండేళ్ల క్రితం భారత్, ఆస్ట్రేలియా జట్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడ్డాయి. అప్పుడు మ్యాచ్ సమయంలో యశస్వీ ఫార్వార్డ్ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. క్రీజులో ఉన్న స్టీవెన్ స్మిత్ బంతిని ఆడకముందే యశస్వీ పైకి లేచాడు. దాంతో, అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మకు చిర్రెత్తుకొచ్చింది.
‘అరే.. నువ్వు ఏమైనా గల్లీ క్రికెట్ ఆడుతున్నావా. అలానే ఉండు. బ్యాటర్ బంతిని ఆడేంత వరకూ లేవొద్దు అని రోహిత్ నన్ను హెచ్చరించాడు’ అని యశస్వీ వెల్లడించాడు. ఇప్పటి వరకూ 29 మ్యాచుల్లో 2,535 రన్స్ కొట్టిన యశస్వీ.. శ్రీలకంతో రెండు టెస్టు సిరీస్‌లోనూ పరుగుల వరద పారించాలని భావిస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

