Lionel Messi : ఇటీవలే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన లియోనల్ మెస్సీ(Lionel Messi) మరోసారి మెరిశాడు. ఇంటర్ మియామి (Inter Miami) క్లబ్ తరఫున వందో గోల్ కొట్టాడీ వెంటరన్. బుధవారం జరిగిన కాంపెయోన్స్ కప్ ఫైనల్లో మెస్సీ గోల్‌తో క్రుజ్ అజుల్‌పై 2-0తో ఇంటర్ మియామి జయభేరి మోగించింది. తమ జట్టుకు ట్రోఫీ అందించిన ఈ సాకర్ మాంత్రికుడు వ్యక్తిగతంగా 49వ ట్రోఫీని సాధించాడు.
మైదానంలోకి దిగాడంటే గోల్స్‌తో రెచ్చిపోయే లియోనల్ మెస్సీ ఈసారి ఫైనల్లో చెలరేగాడు. క్యాంపెయోన్స్ కప్ టైటిల్ పోరులు క్రుజ్ అజుల్‌పై 24వ నిమిషంలో మెస్సీ సూపర్‌గా గోల్ చేశాడు. లూయిస్ సూరెజ్ అందించిన పాస్‌ను అంతే అద్భుతంగా తలతో బంతిని ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి పంపాడు.
GOOOOAL! Messi’s 100th comes in a final. 🤯💯 pic.twitter.com/mpY4Jhrj1c
— Inter Miami CF (@InterMiamiCF) September 17, 2026
ఇంటర్ మియామి తరఫున మెస్సీకి ఇది వందో గోల్ కావడం విశేషం. పీఎస్జీ(పారిస్ సెయింట్ జర్మనీ) నుంచి 2023లో ఈ క్లబ్‌కు మారిన ఈ సాకర్ దిగ్గజం.. 115వ మ్యాచ్‌లో సెంచరీ గోల్ సాధించాడు. మొత్తంగా అతడు వచ్చాక మియామి నాలుగు ట్రోఫీలు గెలుపొందింది. కెరీర్ పరంగా వరల్డ్‌కప్, క్లబ్స్ తరఫున గెలిచిన టైటిళ్లతో కలిపి 49వ ట్రోఫీతో మెస్సీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. తండ్రి మరణంతో కొన్ని రోజులు ఆటకు బ్రేకిచ్చి.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టిన ఈ వెటరన్ ప్లేయర్ మునపటిలా గోల్స్‌తో అభిమానులను అలరిస్తున్నాడు.
🚨💣 LIONEL MESSI 🇦🇷 A SOULEVÉ CETTE NUIT LE 49e TROPHÉE DE SA CARRIÈRE EN REMPORTANT LA CAMPEONES CLUB !!!!! 🤩🏆
Évidemment personne ne fait mieux dans l’Histoire. 🐐
Depuis son arrivée à l’Inter Miami 🇺🇸 c’est :
🏆🏆🏆🏆🏆 5 trophées
🏟️ 114 matches
⚽️ 100 BUTS
🎯 55 PASSES…— Actu Foot (@ActuFoot_) September 17, 2026
ప్రస్తుతం కెరీర్లో అత్యధిక ట్రోఫీలు సాధించిన వారి జాబితాలో లియోనల్ మెస్సీ అగ్రస్థానంలో ఉండగా.. డానీ అల్వెస్ 43 ట్రోఫీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
1. లియోనల్ మెస్సీ(అర్జెంటీనా) – 49 ట్రోఫీలు
2. డానీ అల్వెస్(బ్రెజిల్) – 43 ట్రోఫీలు
3. మార్కిన్హోస్(బ్రెజిల్) – 42 ట్రోఫీలు
4. అండ్రెస్ ఇనియెస్టా(స్పెయిన్)- 40 ట్రోఫీలు