చుంచుపల్లి, సెప్టెంబర్ 17 : పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న “వనజీవి రామయ్య” లఘు చిత్రంలో ప్రకృతి ప్రేమికుడు, వాక్ ఫర్ ట్రీస్ కార్యక్రమ నిర్వాహకుడు విశ్వామిత్ర చౌహాన్‌కు ప్రత్యేక పాత్ర లభించింది. హైదరాబాద్‌లోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో లఘు చిత్రం షూటింగ్ గురువారం నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ వనజీవి రామయ్య పాత్రలో కథానాయకుడిగా నటిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా చార్మినార్ సర్కిల్ సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, ఐఎఫ్ఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా చిన్ననాటి నుండి ప్రతిరోజూ మొక్కలు నాటుతూ 1,568 రోజుల్లో 1,568 మొక్కలు నాటిన విశ్వామిత్ర చౌహాన్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. వనజీవి రామయ్య స్ఫూర్తితోనే తాను ప్రతిరోజూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నానని విశ్వామిత్ర చౌహాన్ తెలిపారు. వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో తనకు ప్రత్యేక పాత్ర లభించడం గర్వంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తున్న విశ్వామిత్ర చౌహాన్‌కు లఘు చిత్రంలో ప్రత్యేక స్థానం కల్పించడం విశేషంగా నిలిచింది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.