– పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
కొత్తగూడెం గణేష్ టెంపుల్, సెప్టెంబర్ 17 : అట్టడుగు వర్గాలకు సైతం అభివృద్ధి ఫలాలను అందించడం కేసీఆర్‌తోనే సాధ్యమని, తెలంగాణ అభివృద్ధే తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఏకైక లక్ష్యం అని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 ను పురస్కరించుకుని జాతీయ జెండా, బీఆర్ఎస్ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, మచ్చ నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగల్ రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ , లక్కినను సురేందర్, కోసం నరసింహారావు, మంతపురి రాజు గౌడ్, అనుదీప్, సింధు తపస్వి, బొమ్మర్ల వరప్రసాద్, శివకృష్ణ పాల్గొన్నారు.