e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News వ్యాప్తి అంచ‌నా : ఈ నెల‌లో ఐసీఎంఆర్ సెరో స‌ర్వే

వ్యాప్తి అంచ‌నా : ఈ నెల‌లో ఐసీఎంఆర్ సెరో స‌ర్వే

వ్యాప్తి అంచ‌నా : ఈ నెల‌లో ఐసీఎంఆర్ సెరో స‌ర్వే

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తిని అంచనా వేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) త్వ‌ర‌లో సెరో సర్వేను ప్రారంభించబోతున్న‌ది. ఈ విషయాన్ని నితీ ఆయోగ్ ఆరోగ్య సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్ల‌డించారు. జాతీయ స్థాయిలో సెరో సర్వేకు సన్నాహాలు జరిగిన‌ట్లు చెప్పారు. సెరో సర్వేను ఈ నెలలోనే నిర్వ‌హించేందుకు ఐసీఎంఆర్ పని ప్రారంభిస్తుందని ఆయ‌న పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా సెరో స‌ర్వేను చేప‌ట్టేలా, ఐసీఎంఆర్‌కు స‌హ‌క‌రించేలా చూడాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ఆయ‌న తెలిపారు. సెరో సర్వేతో వ్యాప్తి అంచ‌నాను లెక్క‌గ‌ట్టి అందుకు అనుగుణంగా నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని వీకే పాల్ అన్నారు.

కరోనా మహమ్మారికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మే 7 న దేశంలో రోజూ 4,14,000 కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. కాగా గత 24 గంటల్లో దేశంలో 91,702 కేసులు నమోదయ్యాయి. గత 4 రోజులుగా దేశంలో 1 లక్ష కన్నా తక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయి. మే 3 న దేశంలో కరోనా రికవరీ రేటు 81.8 శాతంగా ఉండ‌గా.. ఇప్పుడు అది 94.9 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 1,34,580 కరోనా రోగులు నయమయ్యారు. దీనితో పాటు ఇప్పటివరకు 24.61 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ల‌వ్ అగర్వాల్ తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ కార్మికులు రెండో మోతాదు పొందాల్సి ఉన్న‌ద‌ని చెప్పారు. వ్యాక్సిన్ వృధా తగ్గించ‌డం వ‌ల్ల ఎక్కువ మందికి టీకాలను అంద‌జేయ‌వ‌చ్చున‌ని ఆయన అన్నారు. కాగా, దేశంలో కరోనా మ‌హ‌మ్మారి స్థిరీకరించినట్లు కనిపిస్తున్న‌దని, అయితే ప్రజలు ఇంకా కరోనా మార్గ‌ద‌ర్శ‌కాలు, శారీరక నిర్ణీత దూరం ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయ‌న తెలిపారు. భారతదేశంలో ఏప్రిల్ 30-మే 6 మధ్య అత్యధిక రేటు 21.6 శాతం నుంచి వారపు కరోనా పాజిటివిటీ రేటు దాదాపు 74 శాతం తగ్గింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

నిజంగా నిజం : కరోనాపై సోష‌ల్ మీడియాలో అన్నీ త‌ప్పుడు రాత‌లే!

క‌రోనా సోమ్నియా : నిద్ర సమ‌స్య‌ల‌ను ఇలా నివారించుకోండి..

డెల్టా వేరియంట్ : బ్రిట‌న్‌లో ద‌ర్యాప్తున‌కు రంగంలోకి సైన్యం

ఇప్పుడేమంటారు : ఆఫ్ఘాన్ జైళ్ల‌లో ఉగ్ర‌వాదుల‌తో సంబంధ‌మున్న పాక్ మ‌హిళ‌లు

యూపీ విభ‌జ‌న : యోగీ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అందుకేనా..?

చ‌రిత్ర‌లో ఈరోజు : 41 ఏండ్ల క్రిత‌మే హాంకాంగ్ ఫ్లూ మ‌హ‌మ్మారి

హేమంత‌ విజ్ఞ‌ప్తి : ముస్లింలు జ‌నాభాను నియంత్రించాలి

క‌రోనా స్పెష‌ల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ్యాప్తి అంచ‌నా : ఈ నెల‌లో ఐసీఎంఆర్ సెరో స‌ర్వే

ట్రెండింగ్‌

Advertisement