Tollywood | ఒక సినిమాను రెండోసారి రిలీజ్ చేయడం అనే ట్రెండ్ 20, 30 ఏళ్ల కింద ఉండేది. అప్పట్లో సీడీలు, వెబ్ సైట్లు, ఓటీటీలు, ఇంత టెక్నాలజీ లేదు. కాబట్టి సినిమా చూడాలంటే థియేటర్ తప్ప మరో ఆప్షన్ ఉండేది కాదు. పైగా విడుదలైన తర్వాత ఆర్నెల్లు, సంవత్సరానికి గాని టీవీలో వచ్చేది కాదు. దాంతో రెండోసారి సినిమాను రిలీజ్ చేసినా కూడా ఎగబడి చూసే వాళ్లు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అంత సినిమా లేదు. ఒక సినిమా విడుదలైన తర్వాత మ్యాట్నీ షో పూర్తయ్యలోపు వాటి పైరసీ వెర్షన్ వెబ్ సైట్లలో దర్శనమిస్తుంది. అలా తప్పించుకున్నా కూడా నెల రోజుల్లోపే ఓటీటీలలో వచ్చేస్తుంది. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ సమయంలో ఒక సినిమాను మరోసారి రిలీజ్ చేస్తే ఆడియన్స్ చూస్తారా అనే అనుమానాలు అందరిలోనూ ఉండేవి.
కానీ వాటిని పటాపంచలు చేస్తూ పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, వర్షం, ఒక్కడు, ఖుషి, ఆరెంజ్ లాంటి సినిమాలకు రీ రిలీజ్ సమయంలోను అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. మొన్నటికి మొన్న సింహాద్రి సినిమాకు మొదటి రోజే దాదాపు 5 కోట్ల గ్రాస్ వచ్చింది అంటే రీ రిలీజ్ సినిమాలను చూడటానికి ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఇష్టపడుతున్నారో అర్థమవుతుంది. ఒకరిని చూసి మరొకరు వరుసగా తమ పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తూనే ఉన్నారు. అయితే ఇలా చేస్తే నిర్మాతలకు ఏంటి లాభం.. వాళ్లకు ఎంత ఖర్చు వస్తుంది.. థియేటర్లలో విడుదల చేస్తే వచ్చిన డబ్బుల్లో వాళ్ల వాటా ఎంత అనేది చాలామందికి క్లారిటీ లేదు.
నిజానికి ఒక కొత్త సినిమా విడుదలైతే మొదటి వారం మల్టీప్లెక్స్ నిర్మాతల మధ్య 40-60 ఒప్పందం ఉంటుంది. అంటే 100 రూపాయల్లో 40 రూపాయలు మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్ తీసుకుంటే.. 60 రూపాయలు నిర్మాత తీసుకుంటాడు. అదే సెకండ్ వీక్ నుంచి 50-50, 60-40 రేషియోలో ఉంటుంది. సినిమాను బట్టి అప్పుడప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు మల్టీప్లెక్స్ ఓనర్స్. కానీ రీ రిలీజ్ విషయంలో మాత్రం మల్టీప్లెక్స్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రేషియో 70-30 ఉంటుంది. అంటే ఒక పాత సినిమా విడుదలై 100 రూపాయల కలెక్షన్ తీసుకొస్తే అందులో 70 రూపాయలు మల్టీప్లెక్స్ ఓనర్స్ తీసుకుంటారు.. 30 రూపాయలు మాత్రమే నిర్మాతకు వస్తాయి.
అంటే ఈ లెక్కన మొన్న పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాకు రీ రిలీజ్ లో దాదాపు 4 కోట్ల షేర్ వచ్చింది. అందులో నిర్మాతకు వచ్చేది కేవలం కోటి పది లక్షలు మాత్రమే. మిగిలిన డబ్బులు మొత్తం మల్టీప్లెక్స్ వాళ్ళు తీసుకుంటారు. ఇదే ఫార్ములా మిగిలిన సినిమాలకు కూడా వర్కౌట్ అవుతుంది. అయితే ఇక్కడ పాత సినిమాను 4k వర్షన్ లో డిజిటల్ సౌండ్‌తో రెడీ చేయడానికి 12 నుంచి 20 లక్షల మధ్యలో ఖర్చవుతుంది. మరీ పాత సినిమా అయితే ఎక్కువ ఖర్చు వస్తుంది.. కానీ 10-15 ఏళ్ల సినిమా అయితే మాత్రం 12 నుంచి 15 లక్షల మధ్యలో రీ మాస్టర్ అయిపోతుందనేది టెక్నీషియన్స్ చెప్తున్న మాట. ఈ లెక్కన పెద్ద సినిమాలను మళ్లీ విడుదల చేస్తే కనీసం కోటి రూపాయలకు పైగానే షేర్ వస్తుంది. అంటే 20 లక్షల ఖర్చుకు 80 లక్షలు లాభం అన్నమాట. ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అందుకే నిర్మాతలు కూడా తమ పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు.
Pawan kalyan | ఓజీలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో.. పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా ఎంట్రీ !
Chiranjeevi | 20 ఏండ్ల తర్వాత మళ్లీ అలాంటి సాహసం చేస్తున్న చిరంజీవి?
Shilpa Shetty | శిల్పా శెట్టి నివాసంలో చోరీ : ఇద్దరిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు