Tamanna-Vijay Varma | తమన్నాతో ప్రేమ విషయం అందుకే రహస్యంగా ఉంచా : విజయ్ వర్మ
Tamannaah-Vijay Varma | గతకొన్ని రోజులుగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో (Vijay Varma) డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తమన్నా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ వర్మ సైతం వారి మధ్య ఉన్న రిలేషన్ షిప్ పై నోరు విప్పాడు.
Tamannaah-Vijay Varma | గతకొన్ని రోజులుగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో (Vijay Varma) డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తమన్నా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయ్ వర్మతో రిలేషన్ నిజమే అంటూ కుండ బద్దలు కొట్టింది. కాగా, తాజాగా విజయ్ వర్మ సైతం వారి మధ్య ఉన్న రిలేషన్ షిప్ పై నోరు విప్పాడు. తమ మధ్య ఉన్నది ప్రేమ బంధం అని తెలిపాడు. ఇదే సందర్భంలో తమన్నాతో బంధం గురించి ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చిందో కూడా క్లారిటీ ఇచ్చాడు.
‘ప్రస్తుతం నా జీవితం ప్రేమతో నిండిపోయి ఉంది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రజలకు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే చెప్పాలని అనుకున్నా. పర్సనల్ లైఫ్ గురించి సమయం వచ్చినప్పుడు బహిర్గతం చేయాలనున్నా. అందుకే తమన్నాతో నా ప్రేమ విషయం బయటపెట్టలేదు’ అని తెలిపాడు.
విజయ్ వర్మతో తనకున్న బంధం గురించి తమన్నా ఇటీవల పెదవి విప్పిన విషయం తెలిసిందే. ‘లస్ స్టోరీస్ 2’ (Lust Stories 2) సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైనట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట మధ్య పరిచయం ఏర్పడి.. అదికాస్తా ప్రేమగా మారినట్లు తెలిపింది.
Also Read..
Adipurush | ట్విట్టర్ ట్రెండింగ్ లో ‘ఆదిపురుష్’.. ఆల్ ది బెస్ట్ చెప్పిన దేవేంద్ర ఫడణవీస్
Uttarakhand | మూడు రోజులుగా.. కుళ్లిన శవాల మధ్యే నవజాత శిశువు
Philippines Earthquake | ఫిలిప్పీన్స్ ను వణికించిన భారీ భూకంపం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

