Uttarakhand | నాలుగు రోజులు వయసున్న నవజాత శిశువు మూడు రోజుల పాటు కుళ్లిపోయిన స్థితిలో (Decomposed Bodies) ఉన్న శవాల మధ్య సజీవంగా ఉంది. తల్లి పాలు లేకపోయినా మూడు రోజులపాటు శిశువు ఆరోగ్యంగా ఉంది. ఈ ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని డెహ్రాడూన్ (Dehradun)లో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నాగల్ జిల్లా సహరాన్ పుర్ కు చెందిన కాసిఫ్ (25), ఆనమ్ (22) దంపతులు టర్నర్ రోడ్డులో ఓ అద్దె ఇంట్లో నాలుగు నెలలుగా నివాసం ఉంటున్నారు. ఆనమ్ జూన్ 9వ తేదీన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అదేరోజు సాయంత్రం డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చింది. అయితే గత మూడు రోజులుగా ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా కాసిఫ్, ఆనమ్ విగతజీవులుగా కనిపించారు.
అయితే వారి నాలుగు రోజుల చిన్నారి మాత్రం సజీవంగా ఉంది. అప్పుల బాధ తాళలేకే ఈ దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నవజాత శిశువును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, బిడ్డ తల్లిపాలు లేకపోయినా ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Nitish Kumar | నితీశ్ కుమార్ వైపు దూసుకొచ్చిన బైక్.. ఫుట్ పాత్ పైకి దూకేసిన సీఎం
Cyclone Biparjoy | ఓవైపు తుపాను.. మరోవైపు భూకంపం.. ఆందోళనలో గుజరాత్ ప్రజలు
Philippines Earthquake | ఫిలిప్పీన్స్ ను వణికించిన భారీ భూకంపం