Philippines Earthquake | ఫిలిప్పీన్స్ (Philippines) ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. ఉత్తర ఫిలిప్పీన్స్ లోని మిండోరో ద్వీపంలో (Mindoro island) గురువారం ఉదయం భూమి కంపించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.5గా నమోదైనట్లు వెల్లడించింది.
యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) ప్రకారం.. దేశ రాజధాని మనీలా (Manila) కు 124 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉందని తెలిపారు.అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
Also Read..
Cyclone Biparjoy | ఓవైపు తుపాను.. మరోవైపు భూకంపం.. ఆందోళనలో గుజరాత్ ప్రజలు
Manipur violence | మణిపూర్‌లో హింస.. మహిళా మంత్రి నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు
EPFO | అధిక పెన్షన్‌కు కావాల్సిన పత్రాలివే.. దరఖాస్తు ప్రక్రియను సరళతరం చేసిన ఈపీఎఫ్ఓ