EPFO | అధిక పెన్షన్‌కు కావాల్సిన పత్రాలివే.. దరఖాస్తు ప్రక్రియను సరళతరం చేసిన ఈపీఎఫ్ఓ
ఇప్పటివరకూ యజమాన్యం నుంచి ఉమ్మడి ఆప్షన్ ప్రూఫ్ చూపించలేని.. అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సరళతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) బుధవారం ఒక సర్క్యులర్ జారీచేసింది.
EPFO | న్యూఢిల్లీ, జూన్ 14: ఇప్పటివరకూ యజమాన్యం నుంచి ఉమ్మడి ఆప్షన్ ప్రూఫ్ చూపించలేని.. అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సరళతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) బుధవారం ఒక సర్క్యులర్ జారీచేసింది. ఇందులో పెన్షన్ దరఖాస్తు ఫారంతోపాటు సమర్పించాల్సిన పత్రాల జాబితాను విడుదల చేస్తూ, అటువంటి దరఖాస్తుల్ని ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసర్లు అనుసరించాల్సిన ప్రక్రియను వివరించింది. దీని ప్రకారం అధిక పెన్షన్ దరఖాస్తుల్లో ఫీల్డ్ ఆఫీసర్లు ఈ అంశాల్ని చూస్తారు…
- చట్టబద్దమైన నిర్దేశిత నెలవారీ వేతన పరిమితిని ( రూ.5000/6500/ 15,000) మించిన ఉద్యోగి వాస్తవ బేసిక్ వేతనానికి అనుగుణంగానే యాజమాన్యం పీఎఫ్ ఖాతాలో జమచేసిందా
- అటువంటి అధిక వేతనాలపై యాజమాన్యం చెల్లించాల్సిన అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీల చెల్లింపు జరుగుతున్నదా
- ఉద్యోగి ఖాతాకు జరిగిన చెల్లింపుల మొత్తం ఆధారంగా ఈపీఎఫ్ఎస్,1952 పేరా 60 ప్రకారం వడ్డీ అప్డేట్ అయ్యిందా ఈ అంశాల్ని ఫీల్డ్ ఆఫీసర్లు పరిశీలించడంతో పాటు జాయింట్ అప్లికేషన్ ఫారంతో పాటు ఈ దిగువ డాక్యుమెంట్లలో కనీసం ఒకటైనా ఉంటేనే అనుమతించాలి. అవి..
- ఆప్షన్/ఉమ్మడి ఆప్షన్ వ్యాలిడేషన్ కోసం యాజమాన్యం సమర్పించిన వేతన వివరాలు
- యాజమాన్యం ధృవపర్చిన సేలరీ స్లిప్ లేదా లేఖ
- ఉమ్మడి వినతి కాపీ మరియు యాజమాన్యం అండర్‌టేకింగ్
- అధిక వేతనంపై పీఎఫ్ చెల్లింపు జరిగిందని సూచిస్తూ 2022 నవంబర్ 4కంటే ముందు పీఎఫ్ కార్యాలయం జారీచేసిన లేఖ
అధిక ఈపీఎస్ పెన్షన్‌కు దరఖాస్తు చేస్తూ ఉమ్మడి డిక్లరేషన్ ప్రూఫ్‌ను సమర్పించని ఉద్యోగులు ఫైనల్ క్లెయిం సెటిల్మెంట్ జరిగే సమయంలో వారి చివరగా పనిచేసిన సంస్థ (యాజమాన్యం) ద్వారా దానిని (ప్రూఫ్) ఇవ్వవచ్చని సర్క్యులర్‌లో వివరించారు. అధిక వేతనాలపై పెన్షన్ మంజూరీ జరిగేముందు ఏ సమయంలోనైనా పెన్షనర్లు/సభ్యులు..పేరా 26(6) కింద యాజమాన్యం అండర్‌టేకింగ్ మరియు ఉమ్మడి వినతిని సమర్పించవచ్చని పేర్కొంది. అధిక ఈపీఎస్ పెన్షన్‌కు దరఖాస్తు చేయడానికి ఈ జూన్ 26 చివరితేదీ అన్న సంగతి గుర్తుంచుకొండి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

