Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) భద్రతలో భారీ వైఫల్యం (Security breach) చోటు చేసుకుంది. సీఎం తన ఇంటి నుంచి బైటకు వచ్చిన సమయంలో ఓ బైక్ నితీశ్ వైపుకు దూసుకొచ్చింది. భద్రతా వలయాన్ని దాటుకుని సీఎంకు అత్యంత సమీపానికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన సీఎం వెంటనే ఫుట్ పాత్ పైకి దూకేశారు. గురువారం ఉదయం మార్నింగ్ వాక్ (morning walk) కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బైకర్ (biker)ను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కమాండెంట్, పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.. సీఎం నివాసానికి చేరుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టారు.
Also Read..
Cyclone Biparjoy | ఓవైపు తుపాను.. మరోవైపు భూకంపం.. ఆందోళనలో గుజరాత్ ప్రజలు
Manipur violence | మణిపూర్లో హింస.. మహిళా మంత్రి నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు
Philippines Earthquake | ఫిలిప్పీన్స్ ను వణికించిన భారీ భూకంపం