Chiranjeevi | 20 ఏండ్ల తర్వాత మళ్లీ అలాంటి సాహసం చేస్తున్న చిరంజీవి?
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంత వేగంగా సినిమాలు చేస్తున్నాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 68 ఏళ్ల వయసులోనూ ఏడాదికి కనీసం రెండు.. కుదిరితే మూడు సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాడు చిరంజీవి. అలాగని అల్లాటప్పా సినిమాలేం చేయట్లేదు.. ఈయన సినిమాలకు కనీసం 100 కోట్ల గ్రాస్ వస్తుంది..
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంత వేగంగా సినిమాలు చేస్తున్నాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 68 ఏళ్ల వయసులోనూ ఏడాదికి కనీసం రెండు.. కుదిరితే మూడు సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాడు చిరంజీవి. అలాగని అల్లాటప్పా సినిమాలేం చేయట్లేదు.. ఈయన సినిమాలకు కనీసం 100 కోట్ల గ్రాస్ వస్తుంది.. హిట్టైతే ఆ లెక్క 200 కోట్లు దాటిపోతుంది. ఇప్పటి స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని మార్కెట్ చిరు సొంతం. అన్నయ్య సినిమా అంటే ఇప్పటికీ అదే మేనియా నడుస్తుంది. భోళా శంకర్ సినిమాపై ముందు నుంచి అంచనాలు పెద్దగా లేకపోయినా.. ఈ మధ్య విడుదలవుతున్న స్టిల్స్, వీడియోలు, మేకింగ్ షాట్స్ చూసాక అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చిరు స్టైల్, మేనరిజం ఈ సినిమాకు హెల్ప్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
ఇందులో ఆయన లుక్ చూస్తుంటే మెగాస్టార్ వయసు మరో 20 ఏళ్లు తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. అంతగా మేకోవర్ అయ్యారు చిరంజీవి. ఇదిలా ఉంటే తాజాగా భోళా శంకర్ తర్వాత చిరు ఏం చేయబోతున్నాడనే దానిపై క్లారిటీ వచ్చేసింది.
ముగ్గురు నలుగురు దర్శకులు చెప్పిన కథలు విన్న చిరంజీవి.. చివరికి వశిష్ట చెప్పిన లైన్‌కు ఫిదా అయిపోయాడు. అక్కడే ఆగిపోయిన చిరు.. ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పేసాడు. ప్రస్తుతం వశిష్ట ఇదే పనిలో బిజీగా ఉన్నాడు. యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. దీనికోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు వాళ్లు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఇది రొటీన్ కమర్షియల్ సినిమా కాదు.. సోషియో ఫాంటసీ డ్రామా. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి లాంటి సినిమాల తర్వాత చిరు నుంచి వస్తున్న మరో సోషియో ఫాంటసీ డ్రామా ఇది. బింబిసారతో టైమ్ ట్రావెల్ కథను అద్భుతంగా ప్రజెంట్ చేసి బ్లాక్‌బస్టర్ కొట్టిన వశిష్ట.. ఇప్పుడు చిరు సినిమాను కూడా అదే రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు.
ఇందులో చిరును ముల్లోకాలకు వీరుడిలా చూపించబోతున్నాడు వశిష్ట. దీనికోసం ఆయన స్క్రిప్ట్‌లో కసరత్తులు మొదలు పెట్టాడు. చిరంజీవి కూడా ఈ కథపై చాలా ఆసక్తిగా ఉన్నాడు. కచ్చితంగా ఇది తనకు మరో జగదేకవీరుడు రేంజ్ సినిమా అవుతుందని నమ్ముతున్నాడు. 2004లో అంజి ఇచ్చిన షాక్‌తో అలాంటి సినిమాలకు ఇప్పటి వరకు దూరంగానే ఉన్నాడు చిరు. కానీ ఇన్నేళ్లకు మళ్లీ ధైర్యం చేస్తున్నాడు. లేట్ ఏజ్‌లోనూ రిస్క్ ఉన్న కథను ఎంచుకుంటున్నాడు. రొటీన్ మాస్ కాకుండా అప్పుడప్పుడూ ఇలా ట్రై చేస్తే తనకు కూడా ఫ్రెష్‌గా ఉంటుందని చిరు ఆలోచన. అందుకే కుర్ర దర్శకులకు ఛాన్సిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా వశిష్ట సినిమా ఓపెన్ అవ్వనుంది.. సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Read More :
Shilpa Shetty | శిల్పా శెట్టి నివాసంలో చోరీ : ఇద్దరిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

