Kancharla Bhupal Reddy | నల్లగొండ, జనవరి 28 : నల్లగొండలోని బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్లోఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ జడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ మున్సిపాలిటీని గతంలో కాంగ్రెస్ పాలకులు నిర్లక్యం చేశారన్నారు.
నల్గొండను సుందర నగరంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారన్నారు. రూ.1300 కోట్లతో పట్టణంలో ఐటీ హబ్, మెడికల్ కళాశాల, రోడ్ల అభివృద్ధి, త్రాగు నీరు, శానిటేషన్,అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ట్రాఫిక్ జంక్షన్ లు, అభివృద్ధి చేసుకున్నామన్నారు. కేటీఆర్ ప్రత్యేక చొరవతో వందల కోట్ల నిధులు తెచ్చి నల్గొండ అభివృద్ధి చేసుకున్నాం. కార్పొరేషన్‌కు అర్హత వచ్చింది అంటే అది బీఆర్ఎస్ చొరవే. అందరి సౌకర్యం కొరకు ఏర్పాటు చేసిన ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌ను మంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. ప్లైఓవర్, ఔటర్ రోడ్డు కాంట్రాక్టర్లను బెదిరించి వసూలు చేసిన డబ్బులతో స్కూల్ కట్టి వాళ్ల పేరు పెట్టుకున్నారు.
రూ.36 కోట్ల నిధులతో ఎన్జీ కళాశాల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చినం. కళా భారతికి 90 కోట్ల నిధులు శాంక్షన్ ఐయింది. కానీ పనులు ప్రారంభం కాలేదని కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధి పనులకు టెండర్ ఎందుకు పిలువడంలేదని ప్రశ్నించారు. నల్గొండ మున్సిపల్ అభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంది. నల్గొండ అభివృద్ధికి ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చినవని ఆర్ అండ్ బి మినిస్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.