మిన్నసొట్ట: అమెరికాలో ఇమ్మిగ్రేషన్ శాఖ(US Immigration) చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ మహిళా నేత ఇల్హన్ ఒమర్‌పై దాడి చేశారు. మిన్నసొట్టాలో ఓ మీటింగ్‌లో మాట్లాడుతున్న సమయంలో చట్టసభ ప్రతినిధి ఒమర్‌పై ఓ వ్యక్తి ద్రవాన్ని చల్లాడు. అయినా ఆ ప్రతినిధి వెనుకడుగు వేయకుండా తన స్వరాన్ని వినిపించారు. సొమాలియాలో పుట్టిన అమెరికా ప్రతినిధి అయిన ఇల్హన్ చాన్నాళ్లుగా ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల చేతుల్లో ఇప్పటికే ఇద్దరు మరణించారు. ఈ నేపథ్యంలో హోంల్యాండ్ సెక్యూర్టీ చీఫ్ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అమెరికా ప్రతినిధి ఇల్హన్ ఒమర్‌పై దాడి చేసిన వ్యక్తిని 55 ఏళ్ల ఆంటోనీ కజిమిరేచాక్గా గుర్తించారు. ఒమర్‌పై ద్రవాన్ని చల్లిన సమయంలోనే అక్కడ ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ దాడిలో ఎటువంటి గాయాలు లేకుండా ఆమె బయటపడ్డారు. నిందితుడిని పట్టుకున్న సమయంలో ఆ మహిళా నేత భయపడకుండానే అతని వైపు దూసుకెళ్లారు. ఏ కారణం చేతలో నిందితుడు దాడికి పాల్పడ్డారో ఇంకా తెలియదు. ప్రస్తుతం మిన్నియాపోలీసులో తీవ్ర స్థాయిలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల చెకింగ్ చేస్తున్నారు. ఆధారాలు సరిగా లేరి వారిని డిపోర్ట్ చేస్తున్నారు.