Arijit Singh : బాలీవుడ్ గాయకుడు, స్వర మాంత్రికుడి అర్జిత్ సింగ్ (Arijit Singh) అభిమానులకు బిగ్ షాకిచ్చారు. సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జిత్.. ప్లే బ్లాక్ సింగర్‌గా తన ప్రయాణం ముగిసిందని ప్రకటించారు. తన గాత్రంతో ఉర్రూతలూగించే ఆయన ఇకపై సినిమాలకు పాడబోనని చెప్పి అందరికీ బిగ్ షాకిచ్చారు. మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా అర్జిత్ ఇకముందు నుంచి ప్లే బ్లాక్ సింగర్‌గా కొత్త ప్రాజెక్టులు చేయనని ప్రకటన విడుదల చేశారు.
‘హలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. శ్రోతలుగా ఇన్నేళ్లు నాకు అమితమైన ప్రేమ, మద్దతు అందించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు నుంచి నేను ప్లే బ్లాక్ సింగర్‌గా కొత్త ప్రాజ్టెక్టులకు సంతకం చేయను. అవును.. ప్లే బ్లాక్ సింగర్‌గా నా ప్రస్థానం ముగిసింది. ఈ ప్రయాణం ఎంతో అద్బుతమైనది.
A voice that defined a generation steps back 💔 Arijit Singh has decided to retire from playback singing, sharing the news with his followers through his Instagram account.#IIFA #Bollywood #ArijitSingh pic.twitter.com/yFaQdNxbZN
— IIFA (@IIFA) January 27, 2026
దేవుడు నాపట్ల ఎంతో దయతో ఉన్నాడు. నేను మంచి సంగీతానికి అభిమానిని. భవిష్యత్‌లో మరిన్ని విషయాలు నేర్చుకుంటూ నేను సొంతంగా.. ఆర్టిస్ట్‌గా రాణించాలనుకుంటున్నా. మీ అందరి మద్దతుకు కృతజ్ఞుడిని. ప్రస్తుతానికైతే కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాల్సి ఉంది. వాటిని త్వరగా పూర్తి చేస్తాను. ఈ ఏడాది నా పాటలు కొన్ని విడుదలవుతాయి. చివరగా మీకో విషయం.. నేను సంగీతాన్ని మాత్రం విడిచిపెట్టను’ అని అర్జిత్ సింగ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే.. అతడు ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియాల్సి ఉంది.
భారతీయ సంగీతంలో అర్జిత్ సింగ్ పేరు ఒక సంచలనం.. ప్రేమ, విరహ గీతాలతో పాపులరైన ఆయన ఎన్నో హిట్ పాటలతో కుర్రకారు మనసులో చెరగని స్థానం సంపాదించారు. తుమ్హి హో(ఆషికీ 2), కశ్వీర్ మై తూ కన్యాకుమారి(చెన్నై ఎక్స్‌ప్రెస్), లవ్ మాషప్, నైనా(దంగల్), బందేయా రె బందేయా(సింబా), ఓ మాహీ, లుట్ పుట్ గయా(డుంకీ), హమారీ ఆధూరీ కహానీ(హమారీ ఆధూరీ కహానీ), దేశ్ మెరే(భుజ్), గల్తీ సే మిస్టేక్(జగ్గ జసూస్), సోల్‌మేట్(ఏక్ తా రాజా), సజ్నీ (లపాతా లేడీస్) పాటలతో అర్జిత్ సింగ్ కోట్లాదిమందిని ఓలలాడించారు.