పశ్చిమ బెంగాల్లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ షురూ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో నాలుగో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగో విడుతలో 44 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 373 మంది బరిలో నిలిచారు. ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 15,940 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1.15కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. దక్షిణ బెంగాల్‌లోని హౌరా, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ, ఉత్తర బెంగాల్‌లోని అలీపుర్దువార్, కూచ్‌బెహార్ జిల్లాల పరిధిలో పోలింగ్ కోసం అధికారులు భారీ భద్రత కల్పించారు. 789 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మకంగా గుర్తించిన కూచ్ బిహార్‌లో 187 కంపెనీల బలగాలను రంగంలోకి దింపారు.
నాలుగో విడతలో బరిలో ఉన్న ప్రముఖులు
టాలీగంజ్‌లో టీఎంసీ ఎమ్మెల్యే అరూప్ బిస్వాస్‌కు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోను బీజేపీ బరిలోకి దింపింది. టీఎంసీ నుంచి బిస్వాస్ మూడు పర్యాయాలుగా గెలుస్తూ వస్తూ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనకు మద్దతుగా సమాజ్ వాదీ ఎంపీ బయాబచ్చన్ ప్రచారం నిర్వహించారు. సీపీఐ(ఎం) ఇదే స్థానం నుంచి డెబ్దుట్ ఘోష్‌ను నిలబెట్టింది. బెహాల్ పశ్చిమ్‌లో నాలుగు పర్యాయాలుగా గెలుస్తూ వస్తున్న విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని నిలువరించేందుకు బీజేపీ నటుడు శబంతి ఛటర్జీని పోటీలో నిలిపింది.
సోనాపూర్ దక్షిణ నియోజకవర్గంలో ప్రముఖ టెలీవిజన్ నటులు బరిలో ఉన్నారు. టీఎంసీ నుంచి లవ్వీ మోయిత్రా పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి అంజనా బసు పోటీ చేస్తోంది. ఉత్తరపార నియోజకవర్గంలో ప్రభీర్ ఘోషల్ బీజేపీ నుంచి, టీఎంసీ నుంచి కాంచన్ ముల్లిక్ తలపడుతున్నారు. హుగ్లీలోని సింగూర్ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది. బెచారం మన్నా, బీజేపీ నుంచి రవీంద్రనాథ్ భట్టాచార్జీ పోటీపడుతున్నారు. రవీంద్రనాథ్ ఇంతకు ముందు టీఎంసీ పార్టీలో కొనసాగగా.. టీఎంసీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు.
చండితాలా నియోజకవర్గంలో బీజేపీ నుంచి నటుడు యశ్‌దాస్ గుప్తా, టీఎంసీ నుంచి స్వాతి ఖండోకర్, సీపీఐ (ఎం) నుంచి హెవీవెయిట్ మహ్మద్ సలీం బరిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు అబ్దుల్ మన్నన్ చాంపాని నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. బీజేపీ దిలీప్ సింగ్‌ను నిలబెట్టింది. షిబ్పూర్ నియోజకవర్గంలో టీఎంసీ క్రికెటర్ మనోజ్ తివారీని బరిలోకి దింపగా.. బీజేపీకి చెందిన రతీంద్రనాథ్ చక్రవర్తి పోటీ చేస్తున్నారు.
ఇవికూడా చదవండి..
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా
కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?
టీకా వేయించుకోండి.. ఉచితంగా బీర్ పొందండి
హోంలోన్ భారం వేగంగా క్లియర్ కావాలంటే..!
బడి మానేసి ట్రేడింగ్.. నేడు యువ కుబేరుడు
రాహుల్ ద్రవిడ్‌ను ఎప్పుడైనా ఇలా చూశారా.. కోహ్లి షేర్ చేసిన ఫన్నీ వీడియో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

