బడి మానేసి ట్రేడింగ్.. నేడు యువ కుబేరుడు
ముంబై: భారతదేశపు యువకుబేరుల్లో ఇప్పుడు నిఖిల్ కామత్ (34) పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. దేశంలోని అతిపెద్ద బ్రోకరేజి సంస్థ జెరోధా వ్యవస్థాపకుడాయన.
నిజానికి ఆయన బడి చదువు కూడా పూర్తి చేయలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పుడు చదువు సరిగా అబ్బలేదు. స్కూలు తనను మెచ్చలేదు. తాను స్కూలును నచ్చలేదు. తండ్రి బ్యాంకు ఉద్యోగి. తరచూ బదిలీలు. బడులు మార్చడం వల్లనేమో చదువు అంతంతమాత్రంగానే సాగింది. తర్వాత మొత్తంగా ఆగింది. అలా ముగిసిన బడి చదువు తర్వాత 14వ యేట దోస్తుతో కలిసి పాత సెల్ ఫోన్ల వ్యాపారంమొదలుపెట్టాడు.
తల్లి తన చదువు మీది బెంగతో ఆ వ్యాపారాన్ని మాన్పించి ఫోన్లను మురికికాలువలో పోసింది. డిగ్రీ లేని తనకు ఉద్యోగం ఎవరిస్తారు? అందుకే చదువులతో సంబంధం లేని స్టాక్మా ర్కెట్ ట్రేడింగ్ లో కాలుమోపాడు. అదీ 17వ యేట. కాల్ సెంటర్ జాబ్ చేస్తూ చిన్నగా షేర్ల ట్రేడింగ్ మొదలుపెట్టారట. తర్వాత 18వ యేట తండ్రి ఇచ్చిన కొద్దిమొత్తం డబ్బుతో పద్ధతిగా ట్రేడింగ్చే యడం మొదలుపెట్టారు. తర్వాత అది ఊపందుకున్నది.
తండ్రి తనపై ఉంచిన నమ్మకం, కాల్ సెంటర్లో తోటి ఉద్యోగులు అందించిన ప్రోత్సాహంతో ఆ తర్వాత కొద్దికాలానికే కాల్ సెంటర్ జాబ్ మానేసి అన్న నితిన్ కామత్‌తో కలిసి జెరోధా కంపెనీ స్థాపించారు. ప్రస్తుతం ఆ కంపెనీ విలువ రూ. మూడున్నర వేలకోట్లు. ట్రూబీకన్ అనే మరో కంపెనీకి కూడా కామత్ అధిపతి. తాను కోటీశ్వరుడినైనా తన పనితీరు మాత్రం మారదని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఏది చేయాలో అదే చేయాలి. ఐదేళ్ల తర్వాత ఆ పని చేస్తాను అంటే దానికి అప్పటికే కాలం తీరిపోయి ఉంటుందని కూడా ఆయన యువతకు సలహా ఇచ్చారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

