కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం |

నాగ్‌పూర్ : మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కొవిడ్ హాస్పిటల్లో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగి నలుగురు మృత్యువాతపడ్డారు. అదే సమయంలో హాస్పిటల్లో ఉన్న 27 మంది రోగులను మరో దవాఖానకు తరలించినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. నాగ్‌పూర్ వాడి పరిసరాల్లోని ప్రైవేటు ఆసుపత్రిలో 30 పడకలు ఉండగా.. 15 ఐసీయూ పడకలు ఉన్నాయి. దవాఖాన రెండో అంతస్థులో ఐసీయూ ఏసీ యూనిట్ నుంచి మంటలు మొదలయ్యాయి. తర్వాత వార్డు మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే మంటలు రెండో అంతస్తుకే పరిమితమయ్యాయి.
మిగతా అంతస్తులకు వ్యాపించకపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర ఉచ్కే పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పినట్లు చెప్పారు. దవాఖానలో కొవిడ్ రోజులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగ్‌పూర్ కలెక్టర్‌తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
Maharashtra: A fire broke out at a COVID hospital in Nagpur
— ANI (@ANI) April 9, 2021
"Around 27 patients at the hospital were shifted to other hospitals. We can't comment on their health condition now. Hospital has been evacuated," says police pic.twitter.com/YfGd9p4Xjh
ఇవికూడా చదవండి..
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?
టీకా వేయించుకోండి.. ఉచితంగా బీర్ పొందండి
హోంలోన్ భారం వేగంగా క్లియర్ కావాలంటే..!
బడి మానేసి ట్రేడింగ్.. నేడు యువ కుబేరుడు
రాహుల్ ద్రవిడ్‌ను ఎప్పుడైనా ఇలా చూశారా.. కోహ్లి షేర్ చేసిన ఫన్నీ వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

