e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News పేమెంట్ సెటిల్మెంట్ల‌కు క్రిప్టో క‌రెన్సీ: వీసా

పేమెంట్ సెటిల్మెంట్ల‌కు క్రిప్టో క‌రెన్సీ: వీసా

పేమెంట్ సెటిల్మెంట్ల‌కు క్రిప్టో క‌రెన్సీ: వీసా

వాషింగ్ట‌న్‌: పేమెంట్ సెటిల్మెంట్ల‌లో త‌న క‌స్ట‌మ‌ర్లు క్రిప్టో క‌రెన్సీ వాడ‌టానికి ప్ర‌ముఖ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ సంస్థ వీసా ఇంక్ అనుమ‌తినిచ్చింది. ప్ర‌ధాన శ్రేణి ఆర్థిక రంగంలోకి డిజిట‌ల్ క‌రెన్సీ వాడకానికి ఆమోదం పెరుగుతున్న నేప‌థ్యంలో వీసా ఇంక్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం

త‌న క‌స్ట‌మ‌ర్లు యూఎస్డీ కాయిన్‌ను పేమెంట్స్ కోసం వాడొచ్చుని వీసా తెలిపింది. త‌న ఖాతాదారుల చెల్లింపుల కోసం పైల‌ట్ ప్రాజెక్టును చేప‌ట్టింది వీసా. అలాగే క్రిప్టో ప్లాట్‌ఫామ్ క్రిప్టో డాట్‌కామ్ వేదిక‌గా కార్య‌క‌లాపాను నిర్వ‌హించేందుకు పైల‌ట్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఈ ఏడాది చివ‌రిలోగా ఈ ఆప్ష‌న్ అమ‌లు చేసేందుకు ప‌లువురు భాగ‌స్వాముల‌ను చేర్చుకునేందుకు ప్ర‌ణాళిక రూపొందిస్తున్న‌ది.

పేమెంట్ సెటిల్మెంట్ల‌కు క్రిప్టో క‌రెన్సీ: వీసా

అమెరికా డాల‌ర్‌తో నేరుగా లావాదేవీలు జ‌రిపేందుకు యూఎస్డీ కాయిన్ (యూఎస్‌డీసీ) స్టేబుల్ క్రిప్టో క‌రెన్సీగా ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోల్లో క్రిప్టో క‌రెన్సీలు నిరంత‌ర ప్ర‌క్రియ కానున్న నేప‌థ్యంలో బీఎన్వై మెల్లాన్‌, బ్లాక్ రాక్ ఇంక్‌, మాస్ట‌ర్ కార్డ్ ఇంక్ త‌దిత‌ర ప్ర‌ధాన ఆర్థిక సంస్థ‌లు కొన్ని డిజిట‌ల్ కాయిన్స్‌ను క‌లిగి ఉన్న నేప‌థ్యంలో వీసా నిర్ణ‌యానికి ప్రాధాన్యం ఏర్ప‌డింది.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను బిట్ కాయిన్‌తో త‌మ క‌స్ట‌మ‌ర్లు కొనుగోలు చేయొచ్చున‌ని గ‌త‌వారం టెస్లా ఇంక్ అధినేత ఎల‌న్ మ‌స్క్ ప్ర‌క‌టించారు. మ‌స్క్ చ‌ర్య‌ రోజువారీ వాణిజ్య లావాదేవీల్లో క్రిప్టో క‌రెన్సీ వాడ‌కంలో గ‌ణ‌నీయ ముంద‌డుగుగా భావిస్తున్నారు.

వీసా క్రిప్టో హెడ్ కుయ్ షెఫీల్డ్ స్పందిస్తూ.. ప్ర‌పంచ వ్యాప్తంగా డిజిట‌ల్ క‌రెన్సీల‌ను క‌లిగి ఉండ‌టంతోపాటు వాడేందుకు త‌మ క‌స్ట‌మర్ల నుంచి డిమాండ్ పెరుగుతున్నార‌ని తెలిపారు. క‌స్ట‌మ‌ర్లు పొందేందుకు వీలుగా ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేయాల‌ని త‌మ క్లయింట్ల నుంచి డిమాండ్ రావ‌డం గ‌మ‌నించామ‌న్నారు.

పేమెంట్ సెటిల్మెంట్ల‌కు క్రిప్టో క‌రెన్సీ: వీసా

ఉదాహ‌ర‌ణ‌కు సంప్ర‌దాయంగా ఒక క‌స్ట‌మ‌ర్ క్రిప్టో డాట్ కాం వీసా కార్డ్‌ను కాఫీ సేవించినందుకు డ‌బ్బు చెల్లించ‌డానికి ప్ర‌య‌త్నించాడని అ‌నుకుందాం.. క్రిప్టో క‌రెన్సీ వాలెట్‌లో ఉన్న డిజిట‌ల్ క‌రెన్సీని సంప్ర‌దాయ క‌రెన్సీలోని మార్చాల్సిన అవ‌స‌రం ఉంది.

సంప్ర‌దాయ క‌రెన్సీలోకి డిజిట‌ల్ కాయిన్స్ మార్చుకునేందుకు వీలుగా వీసా ఇంక్ తాజాగా ఎథి‌రీయం బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్న‌ది. డిజిట‌ల్ అసెట్ బ్యాంక్ యాంక‌రేజ్‌తోనూ వీసా భాగ‌స్వామ్యం కుదుర్చుకున్న‌ది.

ఇవి కూడా చ‌ద‌వండి:

మోటార్ ఫీల్డ్‌కు జంట స‌వాళ్లు: కండ‌క్ట‌ర్ల కొర‌త+చిప్‌ల ధ‌ర‌లు పైపైకి..!!

చిప్‌ల కొర‌త‌.. ఎందుకిలా..

ఇండ్ల‌‌కు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్‌’ ప్రియారిటీ!

ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్‌ ఈజీ..

ఇల్లు కొనే వారికి అద్భుత అవ‌కాశం.. సీఎల్ఎస్ఎస్ స‌బ్సిడీలివే..!

క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి

ఈక్వ‌లైజేష‌న్ లెవీతో భార‌త్ త‌ల గోక్కోవ‌డ‌మేనా‌!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేమెంట్ సెటిల్మెంట్ల‌కు క్రిప్టో క‌రెన్సీ: వీసా

ట్రెండింగ్‌

Advertisement