రైతుల కష్టాలు కనిపించడం లేదా..?
‘రెండు నెలల నుంచి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేక రైతులు ఇబ్బంది ప డుతున్నరు.. అయినా అన్నదాతల కష్టాలు సీఎం రేవంత్‌రెడ్డికి పట్టవు.. వడ్లను కొనే దిక్కు లేదు. కొనుగోలు కేంద్రానికి వచ్చే దమ్ము ఏ ఒక్క మంత్రికైనా ఉం దా.. రైతులు ఉరికిచ్చి కొడుతరు.. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమే..’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు.
- ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం
- కండ్లు లేని కబోదులు.. కాంగ్రెస్ పాలకులు
- ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమే
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- ప్రభుత్వ మెడలు వంచి ధాన్యం కొనిపిస్తామని వెల్లడి
దేవరుప్పుల, జూన్ 5: ‘రెండు నెలల నుంచి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేక రైతులు ఇబ్బంది ప డుతున్నరు.. అయినా అన్నదాతల కష్టాలు సీఎం రేవంత్‌రెడ్డికి పట్టవు.. వడ్లను కొనే దిక్కు లేదు. కొనుగోలు కేంద్రానికి వచ్చే దమ్ము ఏ ఒక్క మంత్రికైనా ఉం దా.. రైతులు ఉరికిచ్చి కొడుతరు.. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమే..’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎర్రబెల్లి సందర్శించా రు. రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నా రు. ‘ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి రెండు నెలలైంది.. కాంటా వేసే దిక్కు లేదు.. కాలం నెత్తిమీదికొచ్చింది.
రోహిణి కార్తె సగం గడిచింది.. దుక్కులు దున్నలే. పిల్లాపాపలతోని కుటుంబం మొత్తం ఇక్కడనే నీలుగుతున్నం, వానలు కురిస్తే వడ్లు మట్టిపాలవుతయ్..’ అని పలువురు రైతులు ఎర్రబెల్లితో ఆవేదనగా చెప్పారు. దీనిపై స్పందించిన దయాకర్‌రావు ‘తాను ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు గమనిస్తున్నా.. ఇంత చేతగాని ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలే.. ఇది దద్దమ్మ ప్రభుత్వం.. దోచుకునుడు దాచుకునుడే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది..’ అని వి మర్శించారు. రైతులు అష్ట కష్టాలు పడుతుంటే సర్కారుకు చలనం లేదు.. వ్యవసాయ పనులు వదిలి రోజుల తరబడి యూరియా కోసం ఎరువు ల దుకాణాల చుట్టూ తిరిగిండ్రు. నెలల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉంటున్నరు. ఇగ ఎప్పుడు వ్యవసాయం చేయా లె.. ఇవి రేవంత్‌రెడ్డికి కనిపించడంలేదా ..’ అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. రైతుబంధు ఇయ్యవైతివి. యూరియా ఇయ్యవైతివి, ధాన్యం కొనవైతివి. మద్దతు ధర ఇయ్యవైతివి, చెప్పిన బోనస్ దిక్కులేదాయె.. ఇగ దేనికి మీ రుండి అని సర్కారు తీరుపై దుయ్యబట్టారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాలు ఉండవ్. తప్పిదారి తూకం వేస్తే రెండు కిలోలు ఇక్కడ, మరో రెండు కిలోలు రైస్ మిల్లర్ కోత పెడుతుండు. దీనికన్న బైట అ మ్ముకున్నది నయమని రైతులు అంటుండ్రు.. అని ఎర్రబెల్లి తెలిపారు. లారీలు రావు. పోతే దిగుమతి కా వు. ఇదేం పద్ధతి. ప్రభుత్వానికి కనీస అవగాహన, ప్ర ణాళిక లేకపోతె ఇట్లనే ఉంటది. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిండ్రు. సంపాదన మీద పడ్డరు. ఏ వ ర్గం కష్టాలు వారు వినే, చూసే స్థితిలో లేరు. దేవరుప్పుల మండంలలోని పెద్ద గ్రామాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇంక నెల రోజులైనా వడ్లు తూకం కావు. ఇగనైనా కండ్లు తెరవండి. చివరి గింజ వరకు ధాన్యం కొనాలె. తడిచినా, మొలకొచ్చినా కొనాలె. కొనే వరకూ మీ ఎంబడే పడుతమని హెచ్చరించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

