మోటార్ ఫీల్డ్‌కు జంట సవాళ్లు: కండక్టర్ల కొరత+చిప్‌ల ధరలు పైపైకి..!!

న్యూఢిల్లీ: ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజాలు సెమీ కండక్టర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. తాజాగా కార్ల తయారీలో కీలకమైన చిప్ ధరలను పెంచనున్నట్లు సంబంధిత చిప్‌ల తయారీ సంస్థలు ప్రకటించడంతో భారత ఆటో దిగ్గజ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. అయితే, ఇప్పటికిప్పుడు చిప్‌ల ధరలు పెంచొద్దని చిప్ మాన్యుఫాక్చరర్ సంస్థలను మూడు భారత ఆటోమొబైల్ సంస్థలు కోరాయని సమాచారం.
కరోనా మహమ్మారి ప్రభావంతో వర్క్ ఫ్రం హోం, లెర్నింగ్ ఫ్రం హోం.. పర్సనల్ మొబిలిటీ పెరిగింది. తదనుగుణంగా కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు మొదలు టెక్నాలజీతో అనుసంధానమై తయారవుతున్న కార్లలో వినియోగించే సెమీ కండక్టర్లు, చిప్‌లకు డిమాండ్ పెరిగింది.
తత్ఫలితంగా 2021లో వచ్చే రెండవ, మూడవ త్రైమాసికాల్లో కొరత ఏర్పడటంతోపాటు చిప్‌ల ధరలు 4-6 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ తరుణంలో కార్ల తయారీ కంపెనీలతోపాటు సెమీ కండక్టర్ సంస్థలు ఆల్టర్నేటివ్స్ కోసం అన్వేషిస్తున్నాయి.
ఇతర కంపెనీల నుంచి డిమాండ్ పెరగడంతో చిప్‌ల తయారీ దారులు వాటి ధరలు పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆటోమోటివ్తోపాటు టెలికం, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఇతర పరిశ్రమల నుంచి డిమాండ్ పెరిగింది. అయితే, డిమాండ్‌కు అనుగుణంగా చిప్‌ల తయారీదారుల సరఫరాపై వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని డెల్లాయిట్ పార్టనర్ రజత్ మహాజన్ పేర్కొన్నారు.
సెమీ కండక్టర్ల కొరత నుంచి బయటపడేందుకు భారతదేశంలోని దక్షిణ కొరియా, జపాన్‌లకు చెందిన కార్ల తయారీ సంస్థలు స్వల్ప కాలిక పరిష్కారం కోసం వేచి చూస్తున్నాయి. వచ్చే 2, 3 నెలల్లో భారత్‌లో స్థానిక సరఫరా దారుల నుంచి చౌకధరకే హెల్తీ చిప్‌ల సరఫరాకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాయి.
కొన్ని కార్ల తయారీ సంస్థలు భారీ స్థాయిలో చిప్‌లను నిల్వ చేసుకున్నాయి. ప్రస్తుత అవసరాలను ఆయా నిల్వలతో పూరిస్తున్నాయి. టయోటా కిర్లోస్కర్ సీనియర్ ఉపాధ్యక్షుడు నవీన్ సోనీ మాట్లాడుతూ వచ్చే రెండు లేదా మూడు నెలలు సమస్యను అధిగమించినా.. దీర్ఘ కాలంలో ప్రభావం పడుతుందన్నారు.
రెనెసాస్ ఎలక్ట్రానిక్స్, టియాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి సంస్తలు లాజిక్/అనలాగ్ ఐసీస్, మైక్రో కంట్రోలర్, మైక్రో ప్రాసెసర్లు, మెమొరీ గల చిప్‌లను తయారు చేస్తాయి. ఈ చిప్స్ వివిధ కార్లలో పవర్ ట్రైన్, సేఫ్టీ, టెలీమాటిక్స్, ఇన్ఫోటైన్మెంట్ అండ్ బాడీ ఎలక్ట్రానిక్స్‌లో వినియోగిస్తారు.
ఈ సమస్యను అధిగమించడానికి సప్లయి చైన్ రీ మోడలింగ్, డిజిటల్ సొల్యూషన్స్ అమలు, బహుళ అంచెల సరఫరా వ్యవస్థను రూపుదిద్దుకోవాల్సి ఉంటుందని టాటా మోటార్స్ చీఫ్ పర్చేజింగ్ ఆఫీసర్ అండ్ ప్రెసిడెంట్ థామస్ ఫ్లాక్ అభిప్రాయ పడ్డారు.
దీనిపై స్పందించడానికి హ్యుండాయ్, మారుతి సుజుకి స్పందించలేదు. ఇక సెమీ కండక్టర్ల కొరత వల్ల మహీంద్రా అండ్ మహీంద్రాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి:
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
ధావన్, పంత్, హార్దిక్ మెరుపులు..భారత్ 329 ఆలౌట్
టయోటా కార్లు ప్రియం ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు
ఆదానీ చేతికి కర్నూల్-వరోరా ట్రాన్సిమిషన్!
ఇక మెడికల్, డిజటల్ సహా పలు రంగాల్లోకి టాటా విస్తరణ
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- automobile
- chips shortage
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

