ఇలాంటి అవకాశం మళ్లీ రాదు!
ఓ గ్రామం మొత్తం మాట్లాడలేక, కేవలం పాటల రూపంలో సంభాషించే కథ ఇప్పటివరకూ రాలేదు. నా కెరీర్లోనే ఇదొక సవాలు. ఈ సినిమా స్క్రిప్ట్ చదివిన తర్వాత ప్రతీ డైలాగ్‌ను సంగీతంగా మార్చాల్సి వచ్చింది’ అన్నారు అగ్ర సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందిస్తున్న ‘సింగ్ గీతం’ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు.
‘ఓ గ్రామం మొత్తం మాట్లాడలేక, కేవలం పాటల రూపంలో సంభాషించే కథ ఇప్పటివరకూ రాలేదు. నా కెరీర్లోనే ఇదొక సవాలు. ఈ సినిమా స్క్రిప్ట్ చదివిన తర్వాత ప్రతీ డైలాగ్‌ను సంగీతంగా మార్చాల్సి వచ్చింది’ అన్నారు అగ్ర సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందిస్తున్న ‘సింగ్ గీతం’ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నాగ్అశ్విన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర స్వరకర్త దేవిశ్రీప్రసాద్ విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
- నేను సింగీతంగారికి వీరాభిమానిని. మా నాన్నగారిని కలవడానికి ఇంటికి తరచుగా వచ్చేవారాయన. ఆయన మాట్లాడుతుంటే ఆరాధన భావంతో చూసేవాడిని. చాలా ఏళ్ల క్రితం పవన్‌కల్యాణ్‌తో జీసస్ జీవితంపై ఓ సినిమా అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ సమయంలోనే సింగీతంగారు ఈ సినిమా ఐడియా గురించి చెప్పారు. వినగానే థ్రిల్లింగ్‌గా అనిపించింది.
- సింగీతంగారు ట్రెండ్‌ను దాటి కథల గురించి ఆలోచిస్తారు. పుష్పకవిమానం, భైరవద్వీపం, ఆదిత్య 369 ఆ కోవలో వచ్చినవే. ఆయన ఓ ఐడియా అనుకున్నారంటే అది అంతకుముందు ఎప్పుడూ రానిది, భవిష్యత్తులో కూడా రాలేనిది అయి ఉంటుంది. ‘సింగ్ గీతం’ కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మాటల్ని కూడా పాటల్లా పాడుకుంటూ వెళ్తారని అనుకుంటున్నా.
- ఈ సినిమాలో మాటలన్నీ పాటల రూపంలో వినిపిస్తాయి. అందుకే నా కెరీర్లోనే అత్యంత చాలెంజింగ్ సినిమాగా భావిస్తా. చిన్నప్పటి నుంచి ప్రతీ అక్షరాన్ని సంగీతంగా మార్చే అలవాటు ఉండటంతో అది ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. ఓ సన్నివేశాన్ని మ్యూజికల్‌గా చేసి వినిపించాను. అది విని సింగీతంగారు చాలా సంతోషించారు. ‘మనకు కావాల్సిన మ్యూజిక్ ఇదే’ అన్నా రు. నాకది పెద్ద కాంప్లిమెంట్‌లా అనిపించింది.
- ఇది మ్యూజికల్ సినిమా కాబట్టి ప్రతి విషయానికి నేనే బాధ్యత వహించాల్సి వచ్చింది. 24 గంటలూ పనిచేసేవాడిని (నవ్వుతూ). సింగీతంగారి సినిమాలో నేనూ భాగం కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఇదొక బ్లెస్సింగ్. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. నాగ్‌అశ్విన్‌కు సింగీతంగారంటే అమితమైన ప్రేమ. అందుకే అందరం ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం పనిచేశాం.
- ప్రస్తుతం ‘ఎల్లమ్మ’ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు మ్యూజిక్ కూడా చేస్తున్నా. ఇప్పటికే కొన్ని పాటలు చేశాను. ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంపోజ్ పూర్తయింది. ఈ సినిమా కోసం నెలకు పదిరోజులు కేటాయించమని నిర్మాత దిల్‌రాజు చెప్పారు. ‘ఎల్లమ్మ’ విషయంలో చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. నేను తెలంగాణ యాసపై పట్టుసాధించే ప్రయత్నం చేస్తున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

