Chain Snachers | చైన్ స్నాచింగ్ దొంగలను కిష్టమ్మ ఎలా చితక్కొట్టిందో చూశారా..?
Chain Snachers | ఇద్దరు దొంగలు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామంలో పొలం పని చేస్తున్న కిష్టమ్మ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కునేందుకు ప్రయత్నించారు.
Chain Snachers | దొంగలు చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తున్నాయనేది తెలిసిందే. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత అప్రమత్తంగా ఉన్నా దోపిడీ దొంగల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది.
ఇద్దరు దొంగలు పొలంలో పనిచేస్తున్న ఓ మహిళ మెడలో నుండి చైన్ స్నాచింగ్‌కు యత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఇద్దరు దొంగలు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామంలో పొలం పని చేస్తున్న కిష్టమ్మ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కునేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన కిష్టమ్మ కేకలు వేయడంతో స్థానికులు ఇద్దరు దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేశారు. కిష్టమ్మ దొంగలిద్దరినీ కర్రతో చితకబాదింది.
నిందితులను హత్నూర మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన పాత నేరస్తులు వడ్డే సాయిలు, మీనంపల్లి అరవింద్లుగా గుర్తించారు. బాధితురాలు కిష్టమ్మ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు దొంగల బెదిరింపులకు ఏ మాత్రం భయపడకుండా కిష్టమ్మ చూపించిన తెగువకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో నుండి చైన్ స్నాచింగ్‌కు యత్నించిన దొంగలకు దేహశుద్ధి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామంలో పొలం పని చేస్తున్న కిష్టమ్మ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కునేందుకు ప్రయత్నించిన ఇద్దరు దొంగలు
కిష్టమ్మ కేకలు వేయడంతో ఇద్దరు దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
నిందితులను హత్నూర మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన పాత నేరస్తులు వడ్డే సాయిలు, మీనంపల్లి అరవింద్లుగా గుర్తింపు
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2026
Read Also :
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
Woman lost outside Zoo | భర్తతో కలిసి జూకు వెళ్లి అదృశ్యమైన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
‘రైతుల భవిష్యత్ పోరాటాలకు నల్లగొండ మహాసభలో కార్యాచరణ’
Chain Snachers | చైన్ స్నాచింగ్ దొంగలను కిష్టమ్మ ఎలా చితక్కొట్టిందో చూశారా..?
Mallikarjun Kharge | నిరసనను వాయిదావేసే ప్రసక్తే లేదు, ర్యాలీ నిర్వహించి తీరుతాం : మల్లికార్జున్ ఖర్గే
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

