Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
Oxygen Cylinder Explodes | ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిలిచి ఉన్న అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో పది మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ఒక నవజాత శిశువు, ముగ్గురు మహిళలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.
ఇస్లామాబాద్: ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిలిచి ఉన్న అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో పది మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ఒక నవజాత శిశువు, ముగ్గురు మహిళలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు, ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు ఉన్నారు. (Oxygen Cylinder Explodes) పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి థార్పార్కర్ జిల్లాలోని డానో ధంధాల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మిథిలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఒక నవజాత శిశువు, కొందరు రోగులను అంబులెన్స్‌లో తరలించారు.
కాగా, ఆ అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. ఒక నవజాత శిశువు, ముగ్గురు మహిళలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు, ఆసుపత్రి సిబ్బంది, అంబులెన్స్ సమీపంలో ఉన్న స్థానికులతో సహా పది మంది మరణించారు. నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుపాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను పటిష్టం చేయాలని అధికారులను కోరారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
‘ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి’
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

